Nellore TDP Leaders Arrest : నెల్లూరులో టీడీపీ నేతల నిరసన.. లాక్కెళ్లి అరెస్ట్‌లు
రాష్ట్ర బంద్ కి టీడీపీ పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ పోలీసులు ఆ పార్టీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ద్వితీయ శ్రేణి నేతలు పోలీసుల కళ్లుగప్పి రోడ్లపైకి వచ్చారు. నెల్లూరు నగరంతోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత నేతలు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రోడ్లపై బైఠాయించి రాకపోకల్ని అడ్డుకున్నారు. అయితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు.