CISCE: ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ సెమిస్టర్-1 పరీక్షలు వాయిదా.. CISCE అధికారిక ప్రకటన

ఐసీఎస్ఈ, ఐఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతికి సంబంధించి బోర్డ్ సెమిస్టర్ 1 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన చేసింది.

Continues below advertisement

కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎక్సామినేషన్స్ (సీఐఎస్‌సీఈ) ముఖ్యమైన ప్రకటన చేసింది. ఈ విద్యా సంవత్సరం 2021-22 ఏడాదికి సంబంధించిన ఐసీఎస్ఈ, ఐఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతికి సంబంధించి బోర్డ్ సెమిస్టర్ 1 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన చేసింది. ఆ పరీక్షల నిర్వహణకు సంబంధించి తేదీని త్వరలో ఖరారు చేస్తామని ఆ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. అందుకు సంబంధించిన వివరాలు cisce.org వెబ్‌సైట్‌లో చూడవచ్చని వెల్లడించింది.

Continues below advertisement

2021-2022 ఏడాదికి సంబంధించి జరగాల్సిన ఐసీఎస్ఈ, ఐఎస్‌సీ ఒకటో సెమిస్టర్ పరీక్షలు ముందస్తు ప్రణాళికల ప్రకారం.. ఈఏడాది నవంబరు 15, 2021న జరగాల్సి ఉన్నాయి. తాజాగా వీటిని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లుగా సీఐఎస్‌సీఈ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Also Read: 10, 12వ తరగతుల టర్మ్ 1 ఎగ్జామ్ డేట్ షీట్స్ వచ్చేశాయా.. టైమ్ టేబుల్‌పై సీబీఎస్ఈ కీలక ప్రకటన

‘‘ఐసీఎస్ఈ, ఐఎస్‌సీకి సంబంధించి 2021-22 సెమిస్టర్ 1 పరీక్షలను వాయిదా వేయాలని కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎక్సామినేషన్స్ నిర్ణయించింది. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి కొత్త నిర్వహణ తేదీలను, షెడ్యూల్‌ను అన్ని కాలేజీలకు సమాచారం అందిస్తాం. దయచేసి ఈ సమాచారాన్ని విద్యార్థులకు చేరవేయండి. అందరికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’’ అని సీఐఎస్‌సీఈ ప్రకటనలో పేర్కొంది.

ముందస్తు షెడ్యూల్ ప్రకారమైతే.. ఐసీఎస్ఈ ఐఎస్‌సీ సెమిస్టర్ 1 పరీక్షలు ఈ ఏడాది డిసెంబరులోపు పూర్తి కావాల్సి ఉంది. పదో తరగతి పరీక్షలు డిసెంబరు 6న పూర్తి కావాల్సి ఉంది. పాత షెడ్యూల్ ప్రకారం.. పన్నెండో తరగతి ఒకటో సెమిస్టర్ పరీక్షలు డిసెంబరు 16తో పూర్తి కావాలి. 

Also Read: రేపు సీబీఎస్ఈ 10, 12 టర్మ్ 1 టైమ్ టేబుల్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?

ఇక తాజాగా ఈ పాత షెడ్యూల్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎక్సామినేషన్స్ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించగానే.. దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ పొందొచ్చు.

Also Read: ఏపీ నిట్‌లో ఎంబీఏ కోర్సు.. అక్టోబర్ 30తో ముగియనున్న దరఖాస్తు గడువు.. ముఖ్యమైన వివరాలివే.. 

Also Read: దివ్యాంగ విద్యార్థులకు ఏఐసీటీఈ స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50 వేలు సాయం.. 

Also Read: డిప్లొమా, ఇంజనీరింగ్ విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌.. ఏడాదికి రూ.50,000 సాయం.. ప్రగతి ప్రోగ్రామ్ వివరాలివే..

Also Read: విద్యార్థుల కోసం స్కాల‌ర్‌షిప్స్.. నవంబర్ నెలతో ముగియనున్న గడువు.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement