ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా చదువుకు దూరమవుతోన్న దివ్యాంగ (Disabled) విద్యార్థులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) తోడ్పాటు అందిస్తోంది. దివ్యాంగులను ఉన్నత విద్యలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏఐసీటీఈ ఏటా ఈ స్కాలర్షిప్ను అందిస్తోంది. సాక్షం స్కాలర్‌షిప్ స్కీం ద్వారా వీరు చదువుకునేందుకు ఆర్థిక సాయం చేస్తుంది. సాక్షం స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి (2021-22) గానూ డిప్లొమా లేదా డిగ్రీ కోర్సులను చదివే దివ్యాంగులు ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల విద్యార్థులు నవంబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఎన్ఎస్‌పీ అధికారిక వెబ్సైట్ https://scholarships.gov.in/ ను సంప్రదించవచ్చు.
నాలుగేళ్ల పాటు ఏటా రూ.50,000 సాయం..
ఏఐసీటీఈ ఆమోదించిన విద్యా సంస్థల్లో డిప్లొమా / ఇంజనీరింగ్ ఫస్టియర్ లేదా లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి ఏటా రూ.50,000 స్టైఫండ్ అందిస్తుంది. ఇంజినీరింగ్ పూర్తయ్యే (నాలుగేళ్ల పాటు) వరకు ఈ స్కాలర్షిప్ను ఇస్తుంది. మొత్తం 1000 మందికి దీని ద్వారా స్కాలర్‌షిప్ లను అందించనుంది. వీరిలో డిగ్రీ చదువుతున్న వారికి 500, డిప్లొమా వారికి 500 మందికి సాయం చేస్తుంది.
ట్యూషన్ ఫీజు కింద రూ.30,000 ఓకేసారి చెల్లిస్తుంది. మిగతావి నెలకు రూ.2,000 చొప్పున 10 నెలల పాటు (మొత్తం రూ.20,000) చెల్లిస్తుంది. 27 శాతం ఓబీసీలకు, 15 శాతం ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: కోవిడ్ బాధిత విద్యార్థులకు ఎస్‌బీఐ స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.38,500 సాయం..
మరిన్ని వివరాలు..
1. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
2. దరఖాస్తు చేసుకునే విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 8,00,000కు మించరాదు.
3. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు తమ ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని యాడ్ చేయాలి.
4. దరఖాస్తు చేసుకునే వారు తమ పదో తరగతి / ఇంటర్ / ఇతర అవసరమైన డాక్యుమెంట్లను కలిగి ఉండాలి.
5. ట్యూషన్ ఫీజు రిసీప్ట్ తప్పనిసరిగా ఉండాలి.
6. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఫొటోగ్రాఫ్ ఉండాలి.
Also Read: విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్స్.. వచ్చే నెలతో ముగియనున్న గడువు..
Also Read: అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలంటే పీహెచ్ డీ మస్ట్... ఎప్పటి నుంచి అమలంటే...!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి