వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దతి వచ్చాక చాలా మంది బరువు పెరిగారు. పెరిగిన ఆ బరువును తగ్గించుకోవాలని చూస్తున్నారు ఎంతో మంది. అలాంటివారికి ఇంటిపట్టునే, ఆరోగ్యకరమైన పద్ధతుల్లో బరువు ఎలా తగ్గాలో సలహాలిస్తోంది ఆయుర్వేదం. అవేంటో ఒకసారి మీరూ చూడండి...


1. చల్లని నీళ్లను పూర్తిగా మానేయాలి. వాటి బదులు గోరువెచ్చనినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఆయుర్వేదంలో గోరువెచ్చని నీరు అమృతంగా పరిగణిస్తారు. ఇది శరీరంలోని విషతుల్యమైన అవశేషాలను తొలగించడంలో సాయపడుతుంది. ఇవి జిగటగా ఉండే ఆహారపదార్థాలు, కాలుష్యం, జంక్ ఫుడ్ కారణంగా శరీరంలో పేరుకుపోతాయి. 


2. కొంతమంది ఎన్ని గంటలు నిద్రపోయామన్నదే లెక్కపెట్టుకుంటారు కానీ ఏ సమయంలో నిద్రపోయారన్నది కూడా ముఖ్యమే. రాత్రి పది నుంచి ఉదయం 6 వరకు నిద్రపోయేవాళ్లు ఆరోగ్యకరజీవనం సాగిస్తున్నారు. ఆధునిక పరిశోధనల్లో నిద్రలేమి సమస్య కూడా ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తోంది. ఉదయం పూట, అర్థరాత్రి దాటాక నిద్రపోయేవాళ్లలో బరువు పెరిగిన దాఖలాలు ఉన్నాయి. 


3. రాత్రిపూట తినే డిన్నర్ లో చాలా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. దీనివల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి ఉండదు. అంతేకాదు నిద్రపోయాక శరీరం సహజ డిటాక్సిఫికేషన్ చేసుకుంటుంది. ఆయుర్వేదం ప్రకారం రాత్రి ఏడు గంటలలోనే భోజనం చేయడం ఉత్తమం. 


4. ఆయుర్వేదం చిన్న చిన్న భోజనాలు చేయమని సూచిస్తోంది. అంటే ఒకేసారి పొట్టనింపుగా తినే కన్నా... రోజులో మూడు సార్లు కొంచెంగా భోజనాలు తినాలి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ముఖ్య సూచన. మధ్యలో ఎలాంటి అల్పాహారాలు తీసుకోకూడదు. 


5. శరీరం చురుకుగా ఉండడం చాలా అవసరం. అందుకే భోజనం చేశాక పావుగంట సేపు కచ్చితంగా నడవడం అలవాటు చేసుకోవాలి. ఇది మీ జీర్ణ క్రియను పెంచేందుకు సహాయపడుతుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. 


6. సీజన్ ప్రకారం ప్రకృతి మనకు వివిధ రకాల పండ్లు , కూరగాయలు అందిస్తుంది. ఆ సీజన్లలో దొరికే పండ్లు,  కూరగాయలు కచ్చితంగా తినడం అలవాటు చేసుకోవాలి. 


7. ఇళ్లల్లో ఉపయోగించే కొన్ని సాధారణ మసాలా దినుసులు, మూలికలను భోజనంలో భాగం చేసుకోవాలి. పసుపు, అశ్వగంధ, గుగ్గులు, త్రిఫల, దాల్చనచెక్క వంటివి. ఇవి బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!


Also read: బాదం పలుకులను నీటిలో నానబెట్టి తింటేనే ఎక్కువ లాభాలా? పచ్చిగా తినాలా?


Also read: పిల్లలకు తీపి పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది, లేకుంటే పెద్దయ్యాక కష్టాలే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి