పిల్లలకు తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. క్యాండీలు, పీచు మిఠాయి, స్వీట్లు, ఐస్ క్రీములు ఇలా రకరకాల ఆహారపదార్థాలు వారి కోసమే మార్కెట్లో అమ్ముతున్నారు. వీటిలో ఉండే షుగర్ శాతం చాలా అధికం. పిల్లలకి ఇలాంటి పదార్థాలను పరిచయం చేసేది కూడా మనమే. ఏడాది వయసొచ్చేసరికే లాలీ పాప్ లు, ఐస్ క్రీములు తినిపిస్తాం. చిన్నప్పుడు తీపి ఎక్కువగా తినే పిల్లలు పెద్దయ్యాక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువని చెబుతున్నాయి అధ్యయనాలు. 


అధికంగా తింటే ఏమవుతుంది?
అధ్యయనాల ప్రకారం చిన్నపిల్లలు రోజూ తినే చక్కెర 25 గ్రాములకు మించి ఉండకూడదు. కానీ పిల్లలు దానికి వంద రెట్లు అధికంగా ఐస్ క్రీములు, చాక్లెట్ల రూపంలో తింటున్నారు. ఇలా చిన్నప్పుడు అధికంగా చక్కెరను తినే పిల్లల్లో పెద్దయ్యాక ఊబకాయం, శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ (వాపు), టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అతి త్వరగా ఏదైనా ఆహారానికి లేదా పానీయాలకు వ్యసనపరులుగా మారే అవకాశం అధికం. అందుకే చిన్నప్పట్నించే తీపి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉంచడం వల్ల భవిష్యత్తుల వారి ఆరోగ్యాన్ని కాపాడినవారవుతాం. 


చాక్లెట్లు, ఐస్ క్రీములకు బదులు స్నాక్స్ సమయంలో తాజా పండ్లు తినే అలవాటు చేయాలి. తల్లి దండ్రులు ఏం చేస్తారో, పిల్లలు అవే ఫాలో అవుతారు. కాబట్టి వారి ముందు మీరు పండ్లు తినండి. మిమ్మల్ని చూసి వాళ్లు కూడా ఫాలో అవుతారు. అంతేకాదు మార్కులు ఎక్కవ వచ్చినప్పుడు బహుమతిగా చాక్లెట్లు, ఐస్ క్రీములు ఇవ్వడం మానేయండి. ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ల ద్వారా కూడా షుగర్ కంటెంట్ శరీరంలో చేరుతుంది కాబట్టి వాటిని దూరం పెట్టడం ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారవుతారు.


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు. 



Also read: పెరుగుతో పాటూ వీటిని తింటే... ఎంత ఆరోగ్యమో


Also read: ఈ అలవాట్లే... మెదడు స్ట్రోక్‌కు కారణమవుతాయి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి