చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను పోల్చి చూడడం సరికాదని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. మహీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి గర్తు చేస్తున్నాడు. ఒకవేళ పోల్చినా మోర్గాన్ కన్నా ధోనీయే ఐపీఎల్‌లో మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడని వెల్లడించాడు. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు మీడియాతో మాట్లాడాడు.
Also Read: తుది సంగ్రామం నేడే.. కప్పు కోల్‌కతా కొడుతుందా.. చెన్నై చేతికొస్తుందా?
'ధోనీ, మోర్గాన్ ఫామ్‌ను పోల్చడం సరికాదు. ఎందుకంటే మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలాకాలమైంది. మరోవైపు మోర్గాన్ ఇంగ్లాండ్ జట్టుకు సారథి. అందుకే నారింజ పండ్లతో యాపిల్ పండ్లను పోల్చడం తప్పు. ధోనీ చాన్నాళ్ల క్రితమే పోటీ క్రికెట్‌కు దూరమయ్యాడు. అతడు తక్కువ పరుగులు చేయడం, ఫామ్‌లో లేకపోవడంలో అర్థముంది. మరోవైపు మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. వారిద్దరినీ పోలిస్తే మాత్రం ధోనీ మెరుగ్గా ఉన్నాడు. బ్యాటుతోనూ కాసిన్ని పరుగులు చేశాడు' అని గౌతీ అన్నాడు.
Also Read: నేనైతే అశ్విన్‌కు చోటివ్వను..! కేవలం పరుగుల్ని నియంత్రిస్తే సరిపోదన్న మంజ్రేకర్
ఇక ధోనీ బ్యాటింగ్, కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ అంశాలను చూసుకోవాల్సి ఉంటుందని గంభీర్ తెలిపాడు. మోర్గాన్‌కు అన్ని బాధ్యతలు లేవని పేర్కొన్నాడు. కేవలం బ్యాటింగ్, కెప్టెన్సీ చూసుకుంటే చాలని వెల్లడించాడు. అందుకే వారిని పోల్చడం సరికాదని స్పష్టం చేస్తున్నాడు.
Also Read: ఓటమితో గుండె పగిలిన రిషభ్ పంత్.. కన్నీరు పెట్టుకున్న పృథ్వీ షా! చూసిన వాళ్లూ బాధపడ్డారు
ఇండియన్ ప్రీమియర్ లీగులో శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడుతున్నాయి. ఇప్పటి వరకు ధోనీసేన మూడుసార్లు ట్రోఫీలు గెలిచింది. మరోవైపు కేకేఆర్ మూడో ట్రోఫీ కోసం వేచి చూస్తోంది. ఫామ్ పరంగా చూస్తే.. కేకేఆర్‌కు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. యూఏఈకి రాకముందు పట్టికలో ఏడో స్థానంలో ఉన్న మోర్గాన్ సేన వరుస మ్యాచులు గెలుస్తూ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్‌లో బెంగళూరు, రెండో క్వాలిఫయర్‌లో దిల్లీని ఓడించి ఫైనల్ చేరుకుంది. ఏదేమైనా ఐపీఎల్‌లో ఈ ఏడాదీ కొత్త విజేత అవతరించడం లేదు! దిల్లీపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు!
Also Read: టీ20 వరల్డ్ కప్ జట్టులో కీలక మార్పు.. అక్షర్ పటేల్ స్థానంలో వేరే ప్లేయర్.. ఎవరంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి