టీ20 జట్టులో తానైతే రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంచుకోనని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అంటున్నాడు. ఆరేడేళ్లుగా అతడు ఒకే విధంగా బౌలింగ్ చేస్తున్నాడని పేర్కొన్నాడు. తానైతే వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్, యుజ్వేంద్ర చాహల్‌ను ఎంచుకుంటానని వెల్లడించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడు గొప్ప బౌలరేనని స్పష్టం చేశాడు.
Also Read: ఓటమితో గుండె పగిలిన రిషభ్ పంత్.. కన్నీరు పెట్టుకున్న పృథ్వీ షా! చూసిన వాళ్లూ బాధపడ్డారు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రెండో క్వాలిఫయర్‌లో ఆఖరి ఓవర్‌ను అశ్విన్ వేశాడు. ఏడు పరుగులను కాపాడాల్సిన బాధ్యతను అతడికి అప్పగించారు. వరుస బంతుల్లో అతడు షకిబ్, నరైన్‌ను ఔట్ చేశాడు. అయితే ఆఫ్‌సైడ్ దేహానికి దూరంగా వేసిన హాఫ్ ట్రాకర్‌ను త్రిపాఠి కవర్స్ మీదుగా సిక్సర్‌గా బాదేసి విజయం అందించాడు. పరుగులను అడ్డుకోవడం కష్టమే అయినా అతడు కొంత విఫలమయ్యాడు.
Also Read: థ్రిల్లర్‌ను తలపించిన క్వాలిఫయర్ 2.. ఒత్తిడిలో చిత్తయిన ఢిల్లీ.. ఫైనల్స్‌కు కోల్‌కతా!
'అశ్విన్ గురించి మనం ఇప్పటికే చాలా మాట్లాడుకున్నాం. ఒక టీ20 బౌలర్‌గా అతడితో జట్టుకు గొప్పగా ఉపయోగమేమీ లేదు. అతడిలో మార్పేమీ లేదు. ఆరేడేళ్లుగా ఒకే విధంగా బౌలింగ్ చేస్తున్నాను. సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం యాష్ గొప్ప బౌలర్. ఇంగ్లాండ్‌లో అతడు ఒక్క టెస్టైనా ఆడకపోవడం బాధాకరం. అయితే ఐపీఎల్, టీ20ల్లో అతడిపై ఎక్కువ సమయం పెట్టుబడి పెట్టడం సరికాదు' అని మంజ్రేకర్ అన్నాడు.
Also Read: టీ20 వరల్డ్ కప్ జట్టులో కీలక మార్పు.. అక్షర్ పటేల్ స్థానంలో వేరే ప్లేయర్.. ఎవరంటే?
'కొన్నేళ్లుగా అశ్విన్ ఒకే రీతిలో బంతులు వేస్తున్నాడు. పెద్ద మార్పేమీ లేదు. నా జట్టులోనైతే నేను యాష్‌కు చోటివ్వను. ఎందుకంటే టర్నింగ్ పిచ్‌లపై నేను వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్, యుజ్వేంద్ర చాహల్‌ను ఎంచుకుంటాను. వారు మనం కోరుకుంటున్న పని చేస్తున్నారు. వికెట్లు తీస్తున్నారు. టీ20 క్రికెట్లో అశ్విన్ వికెట్ టేకర్ కాదు. కేవలం పరుగులను నియంత్రించడం కోసమే యాష్‌ను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకుంటాయని అనుకోను' అని సంజయ్ తెలిపాడు.
Also Read: కొత్త జట్ల వేలం..! టెండర్ల ప్రక్రియపై బీసీసీఐ తాజా నిర్ణయం తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి