ఇండియన్ ప్రీమియర్ లీగులో దిల్లీ క్యాపిటల్స్ జర్నీ రెండో క్వాలిఫయర్‌తో ముగిసింది. ఫైనల్ చేరేందుకు అన్ని అర్హతలు ఉన్న ఆ జట్టు కేకేఆర్ చేతిలో బుధవారం స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బహుశా మ్యాచ్ గెలిచేవాళ్లేమో! లీగు దశలో అదరగొట్టిన ఆ జట్టు ఫైనల్ చేరకపోవడంతో కుర్రాళ్ల గుండె పగిలింది!
Also Read: థ్రిల్లర్‌ను తలపించిన క్వాలిఫయర్ 2.. ఒత్తిడిలో చిత్తయిన ఢిల్లీ.. ఫైనల్స్‌కు కోల్‌కతా!
షార్జా వేదికగా జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ 135 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యమే అయినా ఆఖరి వరకు రిషభ్ పంత్ సేన గెలుపు కోసమే ప్రయత్నించింది. ఛేదనలో కోల్‌కతాకు శుభ్‌మన్ (46), వెంకటేశ్ అయ్యర్ (55) అదరగొట్టినా ఆ తర్వాత దిల్లీ బౌలర్లు పుంజుకున్నారు. వరుసగా నితీశ్ రాణా (13), దినేశ్ కార్తీక్ (0), ఇయాన్ మోర్గాన్ (౦), షకిబ్ (0), నరైన్ (0)ను వేగంగా పెవిలియన్ పంపించారు. అయితే రాహుల్ త్రిపాఠి (12) నాటౌట్‌గా నిలిచి దిల్లీ ఆశలు చిదిమేశాడు.
Also Read: టీ20 వరల్డ్ కప్ జట్టులో కీలక మార్పు.. అక్షర్ పటేల్ స్థానంలో వేరే ప్లేయర్.. ఎవరంటే?
Also Read: కొత్త జట్ల వేలం..! టెండర్ల ప్రక్రియపై బీసీసీఐ తాజా నిర్ణయం తెలుసా?
అశ్విన్ వేసిన ఆఖరి ఓవర్లో కేకేఆర్‌కు 7 పరుగులు అవసరం. తొలి బంతికి సింగిల్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా రెండు వికెట్లు పడ్డాయి. మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది. ఐదో బంతికి త్రిపాఠి సిక్సర్ బాదడంతో కోల్‌కతా డగౌట్లో సంబరాలు మొదలయ్యాయి. దిల్లీ శిబిరంలో నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆఖరి బంతికి ఓడిపోవడంతో దిల్లీ ఆటగాళ్లు కన్నీరు పెట్టుకున్నారు. ఓపెనర్ పృథ్వీ షా మైదానంలోనే విలపించాడు. రిషభ్ పంత్ గుండె పగిలింది. ఓటమి తర్వాత అతడు నిస్తేజంగా కనిపించాడు. కెప్టెన్ రికీ పాంటింగ్ అతడిని ఓదార్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చిత్రాలు, వీడియోలు వైరల్‌గా మారాయి. శుక్రవారం చెన్నైతో కోల్‌కతా ఫైనల్లో తలపడనుంది.
Also Read: టీమ్‌ఇండియా కొత్త జెర్సీ చూసారా? అద్దిరిపోయింది..! అభిమానులను ప్రతిబింబించేలా డిజైన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి