కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలో నిర్వహించే ప్రాజెక్టులకు సంబంధించి గురువారం నుంచి గెజిట్‌ అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులు పనిచేయనున్నాయి. గెజిట్‌లో పేర్కొన్న ప్రాజెక్టులన్నింటికీ బదులు తెలుగు రాష్ట్రాలు అంగీకారం తెలిపే ప్రాజెక్టుల బాధ్యతలను మొదటి దశలో స్వీకరించనున్నాయి. పలు దశల్లో జరిగిన సమావేశాల్లో చేసిన తీర్మానాల ప్రకారం జాబితాను రెండు రాష్ట్రాలకు అందజేశాయి. మొత్తం 15 అవుట్‌లెట్లకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.


Also Read: తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహ్దదు ప్రాంతాల ఆసక్తి ! కారణం ఏమిటంటే ?


మూడు జల విద్యుత్ కేంద్రాలకు తెలంగాణ నో 


కృష్ణా, గోదావరి బోర్డులు ఖరారు చేసిన ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలను ఇరు రాష్ట్రాలు అప్పగించాల్సి ఉంది. రాష్ట్రాల సమ్మతితో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. 11, 12వ తేదీల్లో జరిగిన గోదావరి, కృష్ణా బోర్డుల సమావేశాల్లో చేసిన తీర్మానం అనుగుణంగా తెలంగాణ, ఏపీలు సమగ్ర వివరాలను బోర్డులకు అందజేస్తేనే గెజిట్‌ అమలు పూర్తిస్థాయిలో సాధ్యమవుతుంది. తెలంగాణ జెన్‌కో పరిధిలోని మూడు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను బోర్డులకు ఇవ్వమని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పింది. అవి మినహా మిగిలిన అవుట్‌లెట్లను అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ఆరు అవుట్‌లెట్లను అప్పగించేందుకు సిద్ధమని ప్రకటించింది. గెజిట్ అమలుకు ఒక రాష్ట్రం ఉత్తర్వులు జారీ చేసి మరో రాష్ట్రం ఉత్తర్వులు జారీ చేయకపోతే గెజిట్‌ పాక్షికంగా అమలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించే అవుట్‌లెట్లను బోర్డుల పరిధిలోకి తీసుకుని ప్రక్రియను ప్రారంభించనున్నాయి. శ్రీశైలం కింద ఏడు, సాగర్‌ కింద ఎనిమిది అవుట్‌లెట్లను కృష్ణా బోర్డు ప్రతిపాదనల్లో చేర్చగా గోదావరి బోర్డు పెద్దవాగును ఎంపిక చేసింది. 


Also Read: ఏపీలోనే విద్యుత్ కష్టాలు..! తెలంగాణలో "పవర్" ఫుల్లేనా ?


ఇరు రాష్ట్రాల నీటి కేటాయింపులను అమలు చేసే బాధ్యతలను బోర్డులు తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల వినతుల మేరకు బోర్డుల పరిధిలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగిస్తాయి. రెండు రాష్ట్రాల పరిధిలోని సిబ్బంది బోర్డు అధికారాల మేరకు నడచుకోవాల్సి ఉంటుంది. గురువారం నుంచి గెజిట్‌ అమలు ప్రారంభమవుతున్నా సిబ్బందితో పాటు నిధులు, ఆస్తులు రాష్ట్రాల నుంచి ఇంకా బదిలీ కాలేదు. మూడు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే అవి కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో విభాగాన్ని తమ పరిధిలోకి తెచ్చుకోవడానికి కృష్ణా, గోదావరి బోర్డులు కార్యాచరణ రూపొందిస్తున్నాయి.


కృష్ణా బోర్డు ప్రతిపాదనల జాబితా



  • తెలంగాణ పరిధిలో 9 అవుట్‌లెట్లు


శ్రీశైలం- ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రం, కల్వకుర్తి పంపుహౌస్‌, సాగర్‌- కుడి కాల్వ హెడ్‌రెగ్యులేటర్‌, ఎడమ కాల్వ హెడ్‌ రెగ్యులేటర్‌, వరద కాల్వ హెడ్‌ రెగ్యులేటర్‌, ఎలిమినేటి మాధవరెడ్డి పంపుహౌస్‌, ప్రాజెక్టు ప్రాజెక్టు, జెన్‌కో పరిధిలోని ప్రధాన జల విద్యుత్‌ కేంద్రం, లాల్‌బహదూర్‌ కాల్వపై ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం



  • ఏపీ పరిధిలో 6 అవుట్‌లెట్లు


శ్రీశైలం- ప్రాజెక్టు (నది, స్లూయీస్‌, స్పిల్‌ వే), పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, ఎస్‌ఆర్‌ఎంసీ, హంద్రీనీవా ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌. కుడి గట్టు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, సాగర్‌- నాగార్జునసాగర్‌ కుడి కాల్వ విద్యుత్‌ కేంద్రం


Also Read: బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రులతో అమిత్ షా కీలక భేటీ


గోదావరి బోర్డు ప్రతిపాదన


రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగు 


Also Read: ఈ నెల 14 నుంచి గెజిట్ అమలు... కేఆర్ఎంబీ కీలక ప్రకటన... బోర్డు పరిధిలోకి జల విద్యుత్ పై తెలంగాణ అభ్యంతరం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి