దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా ఉందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో కేంద్రం హోంమంత్రి అమిత్ షా.. విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడనుందని ఇటీవల భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అమిత్ షా వీరిద్దరితో భేటీ అయ్యారు.


గంటపాటు సాగిన ఈ భేటీలో పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా ఎంత మేర జరుగుతుంది, ఏమైనా కొరత ఉందా అనే అంశం సహా విద్యుత్ డిమాండ్లపై చర్చించినట్లు సమాచారం. వీరితో పాటు బొగ్గు, విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.


భయాందోళనలు..


దేశంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడుతున్నట్లు వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. విద్యుత్‌ సంక్షోభంపై భయాందోళనలు అవసరం లేదని కొట్టిపారేసింది. కేవలం గెయిల్, డిస్కం సంస్థల మధ్య సమాచార లోపం వల్లే ఇలాంటి వార్తలు వస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ ఇటీవల జరిపిన  ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం వెల్లడించారు. 


కేంద్ర విద్యుత్ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం దేశంలో ఉన్న 135 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 108 చోట్ల బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. వాటిలో 28 చోట్ల ఒక్క రోజుకు సరిపడా బొగ్గు మాత్రమే ఉంది, వెంటనే బొగ్గు సప్లై చేయలేకపోతే కరెంట్ ఉత్పత్తి నిలిచిపోతుంది. గత వారం చివరి నుంచి అనేక చోట్ల ఇటువంటి గడ్డు పరిస్థితుల్లోనే పవర్‌‌ ప్లాంట్లు నడుపుకొస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పవర్ క్రైసిస్‌పై ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు.


దిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా బొగ్గు కొరత గురించి పూర్తి వివరాలతో ప్రధానికి లేఖ రాశారు. దిల్లీ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని, దీనిపై తాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరిపడా బొగ్గు నిల్వలు, గ్యాస్ సరఫరా అందిచాలని ప్రధాని మోదీని కోరారు.


Also Read: PM Modi Launches ISPA: అంతరిక్ష రంగంలో సంస్కరణలు అందుకే చేశాం: ప్రధాని మోదీ


Also Read: ఈ కాంబినేషన్‌ ఫుడ్స్‌ని పొరపాటున కూడా కలిపి తినకండి... స్లో పాయిజన్ అయ్యే అవకాశం ఉంది


Also Read: Aryan Khan Drug Case: ఆర్యన్‌ ఖాన్‌కు మూడోసారి కూడా బెయిల్ నిరాకరణ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి