ఐపీఎల్‌లో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ధోని చాలా కాలం తర్వాత తన మార్కు ఫినిష్‌ను చూపించాడు. దీంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. సాధారణంగా ఎవరైనా క్రికెటర్ బాగా ఆడి.. మంచి ప్రదర్శన కనబరిస్తే ఫ్యాన్స్ పొగుడుతూ ట్వీట్లు, పోస్టులు పెడతారు. కానీ ధోని విషయంలో మాత్రం ఆ బాధ్యతను సెలబ్రిటీలే తీసుకుంటారు. దాదాపు 300కు పైగా వెరిఫైడ్ ట్వీటర్ హ్యాండిల్స్ నుంచి ధోనిని పొగుడుతూ ట్వీట్లు వచ్చాయని అంచనా.
స్టార్ హీరో ధనుష్, వెన్నెల కిషోర్, దర్శకులు లోకేష్ కనగరాజ్, విఘ్నేష్ శివన్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, అరుణ్ విజయ్, సయామీ ఖేర్, విరాట్ కోహ్లీ, ప్రీతి జింటా, పార్వతి నాయర్... ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ధోనిని ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్లు చేశారు. ధనుష్ చేసిన ట్వీట్‌కు అయితే రీచ్.. తన సాధారణ ట్వీట్లకు వచ్చే రీచ్ కంటే మూడు రెట్లు అధికంగా ఉండటం విశేషం.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి