అఖిల్ ఆశలన్నీ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’సినిమా మీదే.  అఖిల్ కెరీర్లో భారీ హిట్ ఇంకా పడలేదు. ఆ లోటు ఈ సినిమా తీరుస్తుంటే ఆశతో ఉన్నాడు అఖిల్. అక్టోబర్ 15న దసరాకు ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ మూవీలోని నాలుగు పాటలను చిత్ర యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేసింది. ఇప్పుడు అయిదో పాట ‘చిట్టి అడుగు’ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇది మంచి ఫీల్‌నిచ్చే సోల్ ఫుల్ సాంగ్. ఈ పాటను సిరివెన్నె సీతారామశాస్త్రి రాయగా, జియ ఉల్ హక్ పాడారు. ఈ పాట నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటోంది. అక్కినేని అభిమానులు పాటను షేర్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. 


సినిమా విడుదలకు ఇంకా నాలుగు రోజులే ఉండడంతో చిత్రయూనిట్ ప్రచారంలో జోరు పెంచింది. అందులో భాగంగానే పాటను విడుదల చేసింది. ఇంతవరకు విడుదలైన పాటల్లో లెహరాయి, గుచ్చే గులాబీ ముళ్లు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా మీద అంచనాలను పెంచాయి. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచేలా కనిపిస్తోంది. ‘లెహరాయి’ సాంగ్ ఇప్పటికే రికార్డులు బ్రేక్ చేయడం ప్రారంభించింది. 


ఇందులో అఖిల్ హర్షగా, పూజా హెగ్డే విభా అనే పాత్రల్లో నటించారు. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాకు దర్శకత్వం వహించారు. భాస్కర్ రెండో కూతురి పేరు విభా. ఆ పేరునే తాను హీరోయిన్ కు పెట్టినట్టు చెప్పారు దర్శకుడు. బొమ్మరిల్లు సినిమా హిట్ తో హాసిని పేరు ఎంతగా ప్రాచుర్యంలోకి వచ్చిందో, ఈ సినిమాతో విభా పేరు కూడా అంతగా పాపులర్ అవుతుందని ఆశిస్తున్నారు భాస్కర్. బొమ్మరిల్లు తరువాత అల్లు అర్జున్ తో పరుగు సినిమా చేశారు. ఆ సినిమాకూ మంచి టాక్ సంపాదించింది. ఆ తరువాత రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా తీశారు. ఆ మూవీ అట్టర్ ఫ్లాఫ్ అవ్వడంతో భాస్కర్ సినిమాలకు బ్రేక్ పడింది. ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అఖిల్, భాస్కర్ ఇద్దరికీ ఈ చిత్ర విజయం చాలా అవసరం. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా వ్యవహరించారు. 



Also Read: ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!


Also Read:  ‘మా’లో రచ్చ.. శివబాలాజీ చేయి కొరికిన హేమా.. ప్రకాష్ రాజ్‌తో మంచు ఫైట్


Also read: శునకాలు మరణాన్ని ముందే పసిగడతాయా? వాటి అరుపులతో ఆ విషయాన్ని మనకు తెలియజేస్తాయా?


Also read: గరంగరంగా ఆరోవారం నామినేషన్లు…ఆ ఆరుగురిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు


Also read: మా’ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ రాంగ్ ఛాయిస్? చిరు - మోహన్ బాబు విభేదాలే రచ్చకు కారణమయ్యాయా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి