ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూసినంతసేపు లేదు..బిగ్ బాస్ అప్పుడే ఐదు వారాలు పూర్తిచేసుకుంది. ఇప్పటికే ఐదుగురు కంటిస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఆరోవారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా గరంగరంగా సాగినట్టే ఉంది ప్రోమో చూస్తుంటే.






నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ముందుకి కొనసాగాలంటే అగ్నిపరీక్షను ఎదుర్కోవాలన్న బిగ్ బాస్ ఆదేశం మేరకు ఇంటి సభ్యులంతా ఎవరెవర్ని నామినేట్ చేస్తున్నారో వారి ఫొటోలను మంటల్లో వేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో జెస్సీ... సన్నీని  ఉద్దేశించి నీకు సపోర్ట్ చేసినందుకు బుద్దొచ్చిందన్నాడు. నేను గేమ్ ఆడితే తట్టుకోలేవన్న సన్నీతో బెదిరిస్తున్నావేంటని నిలదీశాడు జెస్సీ. అక్క-తొక్క అని పిలిచి దొంగ ఆడ వద్దని యానీ మాస్టర్ విశ్వ ఫొటో చించి మంటల్లో పడేసింది. సిరి-శ్వేత, సిరి-శ్రీరామ్ మధ్య కూడా గట్టిగానే వాదన జరిగినట్టు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఇక రేషన్ మేనేజర్ గా విశ్వ సరిగా విధులు నిర్వర్తించడం లేదని ఇంటి సభ్యులంతా తిన్నారా లేదా అని చూసే బాధ్యత ఉంటుందన్న ప్రియాపై విశ్వ నా కడుపు నా ఇష్టం నే తింటా అని విశ్వరూపం ప్రదర్శించాడు. రవి  మానస్ ని నామినేట్ చేశాడు సిగ్గుండాలి మళ్లీ అట్నుంచి ఇటు మాట్లాడేందుకు అంటూ లోబో ఫొటో చించేసి మంటల్లో పడేసింది ప్రియాంక సింగ్. 
Also Read: ‘మా’ మంచు విష్ణు విజయంపై సెలబ్రెటీల ట్వీట్స్.. అప్పుడు మాట్లాడలేదు.. ఇప్పుడు..
బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం 14 మంది సభ్యులు ఉన్నారు. ప్రియ కెప్టెన్ కావడంతో ఆమె నామినేషన్లలో లేదు. ఇక మిగిలిన 14 మందిలో యానీ మాస్టర్, RJ కాజల్, షణ్ముఖ్, విశ్వ, జెస్సీ, రవి, మానస్, ప్రియాంక, లోబో, సిరి, సన్నీ, శ్వేత మరియు శ్రీరామ చంద్రలో ఆరుగులు నామినేట్ అయినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన త్వరలో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని..వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఈవారంలోనే అని సమాచారం. ఇప్పటికే మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగోవారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీద ఎలిమినేట్ అయ్యారు. మరి ఆరోవారం నామినేట్ ఆరుగురు సభ్యులు నామినేషన్లలో ఉన్నారని తెలుస్తోంది. మరి వీరిలో బయటకు వెళ్లేదెవరో చూడాలి. 
Also Read: అక్టోబరు 10 మంచు ఫ్యామిలీకి కలిసొచ్చిందా..అప్పుడు మోహన్ బాబు ఇప్పుడు మంచు విష్ణు..హిస్టరీ రిపీట్
Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే.. 
Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి