మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజేతగా నిలిచారు. ప్రకాష్ రాజ్‌పై 107 ఓట్ల భారీ ఆధిక్యంతో విష్ణు గెలుపొందారు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 3 గంటల వరకు జరిగే ఎన్నికల్లో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 925 మంది సభ్యుల్లో కొందరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. సాయంత్రం విడుదల చేసిన ఎన్నికల ఫలితాల్లో విష్ణుకు క్లియర్ మెజారిటీ లభించింది. గత ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఓడి పోయిన వారికి కేవలం 20 నుంచి 30 ఓట్ల తేడా మాత్రమే ఉండేది. కాని ఈసారి ఆధిక్యం సెంచరీ దాటింది. ఇంత ఘన విజయం సాధించిన విష్ణుకు సెలబ్రెటీలంతా సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. మంచు సోదరి మంచు లక్ష్మి, మంచు మనోజ్ కూడా తమ సోదరుడి విజయాన్ని ఎంజాయ్ చేస్తూ ట్వీట్స్ చేశారు.
నా తమ్ముడా మజాకా ఇదిగో నా హీరో అద్భుతమైన విజయం’ అంటూ ట్వీట్ చేశారు మంచు లక్ష్మి.
అంతకుముందే విష్ణు, ప్రకాశ్ రాజ్ కలిసి సెల్ఫీ తీసుకున్న ఫొటోను షేర్‌చేసిన మనోజ్ ‘వాటమ్మా.. వాట్ దిస్ అమ్మా’ అని కామెంట్ చేశాడు.
మంచువిష్ణు విజయం వెనుక మోహన్ బాబు కష్టం చాలాఉందనే చెప్పుకోవాలి. ఆయన కూడా కొంతమంది పెద్దలను కలవడం, ఫోన్లు చేసి మరీ మా అబ్బాయిని గెలిపించండని కోరడంతో కొందరు స్వచ్ఛంగా ఓటేయడానికి వచ్చారు. ఆ పెత్తనం పోలింగ్ రోజు కూడా కొనసాగింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులతో దురుసుగా ప్రవర్తించడం, ఓటేయడానికి వచ్చిన సభ్యులను అభ్యర్థించడం వంటివి చాలానే చేశారు. ఇది కూడా ఒక రకంగా విష్ణుకు కలిసొచ్చింది. మంచు విష్ణు పోలింగ్ ఆరంభం నుంచి ఉత్సాహంగానే ఉండగా.. ప్రకాశ్ రాజ్ లో మాత్రం తెలియని ఆందోళన కనిపించింది. ఫైనల్ గా సభ్యులంతా మంచు చేతికే ‘మా’ను అప్పగించారు.
Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. విష్ణు విజయానికి కారణాలివే.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..
Also Read: హేమ కొరుకుడు.. హాస్పిటల్‌లో శివ బాలాజీ.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్
Also Read:‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి