మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ‘మా’కు తప్పకుండా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ప్రకాష్ రాజ్, హేమా తదితరలు డిమాండ్ చేసిన రోజు మొదలైన మాటల యుద్ధం.. నేటి వరకు కొనసాగుతూనే వచ్చింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు వేర్వేరు ప్యానళ్లు ఏర్పాటు చేసుకుని పోటీకి సిద్ధం కావడంతో టాలీవుడ్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ప్రకాష్ రాజ్ నాన్-లోకల్ అంటూ మంచు విష్ణు, నరేష్ ఆరోపించడం, దీనికి ప్రకాష్ రాజ్, ఆయన ప్యానల్ సభ్యులు వారికి కౌంటర్లు ఇవ్వడంతో వాడీవేడి వాతావరణం నెలకొంది. 


ప్రకాష్ రాజ్‌కు విష్ణు హగ్: ఆదివారం జరిగిన ఎన్నికల్లో మాత్రం ‘మా’ సభ్యులంతా కూల్‌గా మారిపోయారు. ఎన్ని గొడవలున్నా.. మేము.. మేము ఒకటే అన్నట్లుగా కలిసిపోయారు. మోహన్ బాబు ఎదురు కాగానే ప్రకాష్ రాజ్ ఆయన కాళ్లకు మొక్కేందుకు ప్రయత్నించారు. మోహన్ బాబు వద్దని వారించి.. తన కొడుకు మంచి విష్ణుతో షేక్ హ్యాండ్ ఇప్పించారు. దీంతో విష్ణు, ప్రకాష్ రాజ్ హగ్ చేసుకున్నారు.


వీడియో:






Also Read: ప్రకాష్ రాజ్ చుట్టూ వివాదాలే.. బ్యాన్ చేసిన మెగాఫ్యామిలీ ఈరోజు సపోర్ట్ చేస్తుందే..


పోలింగ్ కేంద్రంలో డ్రెస్ కోడ్: పోలింగ్ సందర్భంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ అభ్యర్థులు డ్రెస్ కోడ్ పాటించారు. ప్రకాష్ రాజ్ టీమ్ గ్రీన్ కలర్‌లో, మంచు విష్ణు టీమ్ రెడ్ కలర్ దుస్తుల్లో కనిపించారు. అయితే, పోలింగ్ కేంద్రం లోపల ప్రకాష్ రాజ్, విష్ణు సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. మాట మాట పెరగడంతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!


Also Read: 'మా' ఎన్నికల్లో ఓటేసిన పవన్ కల్యాణ్.. అది అవసరమా అనిపించింది అంటూ కామెంట్