మేషం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది.  వ్యాపారంలో విజయం ఉంటుంది.  ఏదైనా మతపరమైన కార్యక్రమం ఇంట్లో జరగుతుంది. స్నేహితులతో సమావేశం ఉంటుంది. ప్రత్యర్థుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. టెన్షన్ తగ్గుతుంది.  కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు. కొన్ని పనులకు సంబంధించి రిస్క్ తీసుకోండి. ఇంటా-బయటా గౌరవం పెరుగుతుంది. 
వృషభం
ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు.  ఆఫీసులో బాధ్యత పెరుగుతుంది. యువత కెరీర్ పరంగా చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది.  వ్యాపారం మందగించవచ్చు. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త.  కుటుంబ సభ్యుల సహకారంతో పని పూర్తవుతుంది. బంధువుతో వివాదాలుండొచ్చు.
మిథునం
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. మీరు స్నేహితులను కలుస్తారు.  ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది.  మీరు దేవాలయాన్ని సందర్శించేందుకు వెళ్ళవచ్చు.  విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  అనవసరమైన ఖర్చు చేయవద్దు. వ్యాపార సమస్యలను పరిష్కారమవుతాయి. 
Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
కర్కాటకం
శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపారంలో నష్టం వచ్చే సూచనలున్నాయి.  మీ ప్రణాళిక విజయవంతమవుతుంది. కార్యాలయ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. పోటీ పరీక్షలు  ఇంటర్వ్యూల్లో  విజయం సాధిస్తారు. మీరు పెద్ద సమస్య నుంచి బయటపడతారు. అదృష్టం కలిసొస్తుంది.  కుటుంబంలో ఆనందం ఉంటుంది. 
సింహం
ఈరోజు సమస్యాత్మక రోజు అవుతుంది. మీ దినచర్య మారిపోతుంది.  కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఓపికగా ఉండాలి. మీ మాటపై సంయమనం పాటించండి. దూషించే పదాలను ఉపయోగించవద్దు. తెలియని వ్యక్తులతో అనవసర చర్చలు వద్దు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, నిరుద్యోగులకు శుభసమయం. 
కన్య
తెలియని అడ్డంకిని అధిగమిస్తారు.  శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త ప్రణాళికలు వేస్తారు.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  రుణం ఇచ్చేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. భగవంతుడిని పూజించడంపై ఆసక్తి ఉంటుంది. ఒత్తిడి తీసుకోవద్దు.  మీరు పెద్దల ఆశీస్సులు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు తొందరపడకండి. మీ ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. 
Also Read: నవదుర్గలు అంటే ఎవరు, శరన్నవరాత్రుల్లో ఫాలో అవాల్సిన అసలైన అలంకారాలు ఇవేనా..
తుల
వ్యాపారంలో లాభం ఉంటుంది. బంధువుతో వివాదాలు ఉండొచ్చు.  పాత స్నేహితులతో కలుస్తారు.   వాహనాన్ని జాగ్రత్తగా నడపండి..గాయాలయ్యే సూచనలున్నాయి. కుటుంబం గురించి ఆందోళన ఉంటుంది.  మీ ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు.  ఆదాయాన్ని పెంచుకునేందుకు  కొత్త అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.  ఉద్యోగస్తుల బాధ్యత పెరుగుతుంది. 
వృశ్చికం
ఆర్థికంగా మెరుగుపడేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.  పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. తెలివైన వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.  అదృష్టం కలిసొస్తుంది.  సహాయం కోసం ఎవరినీ అడగవద్దు. వివాదాల్లో తలదూర్చవద్దు.ఆరోగ్యం బలహీనంగా అనిపించవచ్చు. నిలిచిపోయిన పనిని పూర్తి చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు. కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించవచ్చు. 
ధనుస్సు
మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారానికి సంబంధించిన పని కారణంగా ప్రయాణం చేస్తారు.  ఆరోగ్యం బాగానే ఉంటుంది. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచండి.  పిల్లల వైపు నుంచి శుభవార్త ఉంటుంది. శత్రువులు ఓడిపోతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. రుణం మొత్తాన్ని తిరిగి పొందగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలుంటాయి. మీ జీవిత భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోండి. పాత వివాదాలు తొలగిపోతాయి. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. 
Also Read: ఆశ్వయుజ మాసం ఎందుకింత ప్రత్యేకం.. శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన వెనుక ఇంత పరమార్థం ఉందా...
మకరం
ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. తెలియని వ్యక్తులతో వివాదాలు ఉండొచ్చు.  వృత్తి పరంగా చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రిస్క్ తీసుకోకండి కొత్త ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనాలు ఉంటాయి. పాత స్నేహితులు, బంధువులను కలుస్తారు. తెలివిగా ఖర్చు చేయండి. మీ ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు పొందుతారు. 
కుంభం 
నిరుద్యోగులకు ఉద్యోగ సూచనలున్నాయి. పనికిరాని విషయాలపై సమయం వృథా చేయవద్దు. చికిత్స ఖర్చు అవుతుంది. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. బాధ్యతను సులభంగా నిర్వర్తించగలుగుతారు.  కుటుంబంలో గొడవలు జరగొచ్చు. ఆదాయం బాగానే ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. 
మీనం
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సమాజంలో  గౌరవం పెరుగుతుంది. అధికారులతో సమావేశం ఉంటుంది. ప్రత్యర్థులు ఓడిపోతారు. శుభవార్త వింటారు.  ఏదైనా పని కొత్తగా  ప్రారంభించడానికి తొందరపడకండి. బంధువులు కలవవచ్చు.  మీరు పెద్దల ఆశీస్సులు పొందుతారు. వ్యాపార సంబంధిత సమస్యలు దూరమవుతాయి. 
Also Read: Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి