శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజంలో వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. మేఘాలు దూదిపింజల్లా ఉంటాయి. అందమైన ఈ రుతువులో వచ్చే నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్కతిలో విలక్షణమైనవి. ఈ మాసంలో సూర్యచంద్రులు నిర్మలంగా కనిపిస్తారు. సూర్యుడు శక్తి కారకుడు. చంద్రుడు మనఃకారకుడు. సర్వసృష్టి స్త్రీ నుంచే సంభవిస్తుంది. పురుషుడు ప్రాణదాత. స్త్రీ శరీరధాత్రి. అందుకు నిదర్శనంగానే ఆశ్వయుజం శక్తిమాసంగా వెలుగుతోంది. కాలం స్త్రీ పురుష రూపాత్మకం అంటారు. సంవత్సరంలోని చైత్రం మొదలు భాద్రపదం వరకు తొలి అర్ధ భాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం వరకు గల ఆరు నెలల కాలం స్త్రీ రూపాత్మకం. ప్రత్యేకించి రెండో అర్ధ భాగంలోని తొలి మాసం ఆశ్వయుజం అమ్మవారి ఉపాసనకు యోగ్యమైన కాలం.
Also Read: నవదుర్గలు అంటే ఎవరు, శరన్నవరాత్రుల్లో ఫాలో అవాల్సిన అసలైన అలంకారాలు ఇవేనా..
వాస్తవానికి శక్తిమాసంగా పిలిచే ఆశ్వయుజం మొదటి నెలగా ఉండాలి. కానీ చాంద్రమానం ప్రకారం చైత్రమాసం మొదటిది అయింది. అదెలా అంటే అశ్విని నుంచి రేవతి వరకూ మొత్తం 27 నక్షత్రాల్లో మొదటి 13, వెనక 13 నక్షత్రాలను విడిచి పెట్టి మధ్యలోఉన్న 14 వ నక్షత్రమైన చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడుకున్న పౌర్ణమి ఉండడంతో చైత్రం మొదటి తెలుగు నెల అయింది. కానీ ఉపాసనకు సంబంధించి ఆశ్వీయుజ మాసము మొదటి మాసం అవుతుంది. భగవంతుని చేరుకోవడానికి ప్రారంభం ఇక్కడి నుంచే మొదలు. ఈ నెల ఆరంభంలోనే శారదా నవరాత్రులు పేరుతో తొమ్మిది రోజులు ఉపాసన చేస్తారు. దీనివెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఆరంభంలో తొమ్మది రాత్రులు కలపి ఒకరోజు ప్రారంభంలో ఉండే తెల్లవారు ఝాముతో సమానమని చెబుతారు. అంటే సూర్యోదయానికి ముందున్న కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని పిలుస్తాం కదా అలా అన్నమాట. అందుకే ఈ నవరాత్రులు ఉపాసనకి పరమయోగ్యమైన కాలమని పురాణాలు చెబుతాయి. ఉపాసన క్రమంలో ఉండే సంవత్సరం మొత్తాన్ని ఒక రోజుగా భావిస్తే అందులో తల్లవారుఝాము కాలం ఏదంటే ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకూ ఉండే కాలం. ఈ తొమ్మిది రాత్రులను బ్రాహ్మీ ముహూర్తంగా పరిగణిస్తారు. అందుకే ఉపాశనకు నవరాత్రులు అత్యంత యోగ్యమైన కాలంగా చెబుతారు.
Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
హిందూ ధర్మంలో అనేక పురాణాలు, శాస్త్రాల్లో ఈ బ్రాహ్మీ ముహూర్తం గురించి ప్రస్తావన ఉంది.
వర్ణా కీర్తి మతిం లక్ష్మీ స్వాస్త్యమాయుశ్ఛ విదంతి|
బ్రహ్మ ముహూర్తే సంజాగ్రచ్ఛివ పంకజ యథా||
దీనర్థం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల అందం, తెలివితేటలు, ఆరోగ్యంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది సంపన్నలవుతారని అర్థం. ఈ ముహూర్తానికి ప్రకృతితో లోతైన సంబంధం ఉంది. ఈ సమయంలోనే జంతువులు, పక్షులు మేల్కొంటాయి. వాటి మధురమైన కిలకిల రావాలు ప్రారంభమవుతాయి. తామర పువ్వు కూడా ఈ సమయంలోనే వికసిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రకృతి కూడా బ్రహ్మీ ముహూర్తంలోనే చైతన్య పరుస్తుంది. అందుకే ఉపాసనకు బ్రాహ్మీ ముహూర్తంగా భావించే శరన్నవరాత్రుల్లో అత్యంత శక్తి దాగిఉందని చెబుతారు. ఈ తొమ్మది రాత్రులు, తొమ్మది పగలు క్రమం విడిచిపెట్టకుండా దైవచింతనలో ఉండాలని చెబుతారు. ఇంట్లో అయినా, దేవాలయంలో అయినా, మండపాల్లో అయినా అమ్మవారికి నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు చేసి పదవరోజు అంటే విజయ దశమి రోజు పూజలు నిర్వహించి అమ్మవారి మూర్తిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు.
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Dussehra 2021 : ఆశ్వయుజ మాసం ఎందుకింత ప్రత్యేకం.. శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన వెనుక ఇంత పరమార్థం ఉందా...
ABP Desam
Updated at:
09 Oct 2021 02:01 PM (IST)
Edited By: RamaLakshmibai
ఆశ్వయజం లోనే సృష్టికి మూలమైన అమ్మవారు విశేషంగా పూజలందుకుంటుంది. ఆడపిల్లల వేడుకైన అట్లతద్ది, తెలంగాణలో బతుకమ్మ ఇవన్నీ ఈ నెలలోనే. అందుకే ఆశ్వయుజాన్ని శక్తిమాసం అంటారు. ఇలా పిలవడం వెనుక ప్రత్యేకత ఏంటంటే
Dussehra (ప్రతీకాత్మక చిత్రం)
NEXT
PREV
Published at:
09 Oct 2021 01:58 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -