సామంత-చైతన్య మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎందుకు విడిపోతున్నారనే క్లారిటీ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతూనే ఉంది. మరోవైపు సమంత ఎప్పటికప్పుడ పోస్టింగ్స్ తో మరింత కాన్సన్ ట్రేషన్ క్రియేట్ చేస్తోంది. మహిళలు ఏం చేసినా ప్రశ్నించే ఈ సమాజం, మగాళ్లను మాత్రం ఎందుకు ప్రశ్నించదంటూ నిలదీసింది. ఆ తర్వాత.. తనకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలను వద్దనుకున్నానని.. అవకాశవాదినని అన్నారని.. ఇప్పుడేమో అబార్షన్స్ కూడా జరిగాయని అంటున్నారని మండిపడింది. విడాకులు అనేది చాలా బాధనిస్తుంది.. ఆ బాధ నుంచి కోలుకోవడానికి కాస్త సమయం ఇవ్వండని కోరింది. తనపై పర్సనల్ ఎటాక్ చేస్తూ.. కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సామ్ ఇవేవీ నన్ను బ్రేక్ చేయలేవని ప్రామిస్ చేస్తున్నా అంటూ రాసుకొచ్చింది. దీంతో నిన్నటి వరకూ ఎందుకు విడిపోయారో అంటూ జరిగిన చర్చ ఇప్పుడు పిల్లలపైకి మళ్లింది. దీనిపై శాంకుంతలం నిర్మాత , గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ షాకింగ్ కామెంట్స్ చేసింది.
Also Read: అఖిల్ కి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఈవెంట్ లో చైతు..
నీలిమ గుణ ఏమందంటే....‘శాకుంతలం సినిమా కోసం మా నాన్న గుణశేఖర్ సమంతను సంప్రదించారు. అయితే అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయింది. పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నామని బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నానని చెప్పింది. అయితే శాకుంతలం సినిమా కథ నచ్చడంతో కొన్ని కండిషన్స్ పెట్టి డేట్స్ కేటాయించింది. త్వరగా షూటింగ్ పూర్తిచేసేస్తే ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నట్టు గుణశేఖర్ కి చెప్పింది. మరీ ముఖ్యంగా జూలై నాటికి షూటింగ్ పూర్తిచేయాలని స్పష్టంగా చెప్పడంతో మేం అలాగే ప్లాన్ చేసుకున్నాం. కుటుంబం కోసం సమయం కేటాయించేందుకే బ్రేక్ తీసుకుంటానని చెప్పిన సామ్ ఇంతలో విడాకుల ప్రకటన చేయడం చూసి షాక్ అయ్యాం అంది నీలిమ. అయితే జూలై వరకూ అంతా సక్రమంగానే ఉన్నట్టు అనిపించిందని..కేవలం ఆగస్టు నెలలోనే ఏదో జరిగింది అందుకే సమంత ఇలాంటి నిర్ణయం తీసుకుందేమో అన్నది.
Also Read: ‘పీకే లవ్’ అంటూ పూనమ్ కౌర్ రచ్చ.. ఈమె చర్యలు ఊహాతీతం
ఇప్పుడు నీలిమ గుణ చెప్పిన మాటలు విని మరోసారి మాధవీలత కామెంట్స్ పై చర్చజరుగుతోంది. పెళ్లి, కుటుంబం, పిల్లలు ఇలా ప్రతి విషయంపై ఆమెకి ఎంతో నమ్మకం ఉందన్న మాధవీలత ఆమె ఎంత మంచి మనిషి అంటే.. షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్లినప్పుడు వచ్చే డబ్బుని నేరుగా ప్రత్యూష ఫౌండేషన్ అకౌంట్ లో వేయిస్తుందని..అనారోగ్యం పాలైన చిన్నపిల్లలకు ఆపరేషన్స్ చేయిస్తుంటుందని చెప్పుకొచ్చింది. అందరికీ తెలియని మరో విషయం ఏంటంటే.. నటిగా ఆమెకి రెమ్యునరేషన్ కోట్లలో వచ్చినా ఆమెకి పాకెట్ మనీ మాత్రమే ఇచ్చేవారని..సమంతని డబ్బులు సంపాదించే మెషీన్ లానే చూశారన్న మాధవీ లత ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడం వల్లే విడపోయేందుకు సిద్ధపడిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నీలిమ గుణ కూడా సమంత కుటుంబం కోసం బ్రేక్ తీసుకోవాలనుకుందని స్పష్టంగా చెబుతోంది. దీంతో నిన్నటి వరకూ తప్పంతా సమంతదే అని జరిగిన ట్రోల్స్ ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీవైపు వేళ్లు చూపిస్తున్నాయి. ఇంతకీ ఆగస్టు నెలలో ఏం జరిగింది? చైతూ-సామ్ విడిపోవడానికి అసలు కారణం ఏంటి?
Also Read: కెప్టెన్ గా ప్రియా.. కాజల్ ని కావాలనే కార్నర్ చేసిన హౌస్ మేట్స్..
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Samantha: సమంత తల్లికావాలనుకుంది..కానీ ఆ ఒక్కనెలలో ఏం జరిగిందంటే..'శాకుంతలం' నిర్మాత షాకింగ్ కామెంట్స్
ABP Desam
Updated at:
09 Oct 2021 10:04 AM (IST)
Edited By: RamaLakshmibai
సమంతకు చైతూతో విడిపోవడం ఇష్టం లేదా..పిల్లకు కావాలనుకుందా..అందుకే 'శాకుంతలం' సినిమా తర్వాత బ్రేక్ తీసుకోవాలని ఫిక్సైందా. మరి ఆ ఒక్క నెలలో ఏం జరిగింది. శాకుంతలం నిర్మాత కామెంట్స్ విని ఏమనుకోవాలి.
Image Credit/ Neelima Guna Twitter
NEXT
PREV
Published at:
09 Oct 2021 10:04 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -