బిగ్ బాస్ సీజన్ 5 ఐదో వారంలో వాతావరణం వేడెక్కింది. రెండు రోజుల పాటు హౌస్ లో 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే టాస్క్ నడిచింది. ఇప్పుడు ఆ టాస్క్ లో విజేతలుగా నిలిచిన రవి టీమ్ నుంచి యానీ మాస్టర్, ప్రియా, శ్వేతా, రవి కెప్టెన్సీ టాస్క్ కోసం పోరాడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఈ నలుగురికీ 'పదివేలు సరిపోవు సోదరా' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో నలుగురు సభ్యులకు నాలుగు రంథ్రాలు ఉండే నీటి ట్యాంక్లను ఇచ్చారు. వారికి సపోర్ట్ చేసే సభ్యులు ఆ ట్యాంక్ రంథ్రాలు మూసి నీళ్లు బయటకు పోకుండా సపోర్ట్ చేయాలని బిగ్ బాస్ తెలిపారు. ఈ టాస్క్‌కు షణ్ముఖ్‌ను సంచాలకుడిగా వ్యవహరించాలని పేర్కొన్నాడు.


ఇక ఈరోజు ఎపిసోడ్ లో కెప్టెన్ గా ప్రియా గెలిచింది. ఆ తరువాత ''నేను వాళ్లను పనిష్ చేయాలనుకోలేదు.. వదిలేద్దాం అనుకున్నా అంతే..'' అంటూ లోబో, విశ్వలతో చెప్పుకొని బాధ పడ్డాడు సన్నీ. అక్కడే ఉన్న మానస్ ఏడుస్తుంటే లోబో కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత సన్నీ..   'ఏంటి మామా ఇది.. ఎమోషన్స్ తో ఆడుకుంటున్నాం..' అంటూ ఏడ్చేశాడు.

 

కెప్టెన్ గా గెలిచిన ప్రియా.. విశ్వాను రేషన్ మ్యానేజర్ గా ఎన్నుకుంది. ఇక టాస్క్ లలో శ్రీరామచంద్ర కావాలనే ఆడడం లేదని.. 'మేం తరువాత ఎఫర్ట్ పెడతాం.. మీరు ఇప్పుడు ఆదుకోండి.. మీరంతా భటులు, మేం కింగ్స్ అన్నట్లు బిహేవ్ చేస్తున్నాడని' మానస్.. కాజల్ దగ్గర చెప్పాడు.

 

ప్రియాతో డిస్కషన్ పెట్టిన మానస్.. యానీ మాస్టర్ కి హమీద చేసేవేమి కనిపించట్లేదా..? అంటూ శ్రీరామచంద్ర గురించి పరోక్షంగా మాట్లాడాడు మానస్. వెంటనే ఫుడ్ పట్టుకొని వచ్చిన ప్రియాంకతో.. 'రేపటి నుంచి నాకేం చేయకు.. నేను కంప్లైంట్స్ తీసుకోలేను.. యానీ మాస్టర్ తో కూడా మాట్లాడతా..' అంటూ ఫైర్ అయ్యాడు. 

 

వెంటనే షణ్ముఖ్, సిరి, జెస్సీల దగ్గర ఏడ్చేసింది ప్రియాంక. ''ఎవరో అనుకుంటే నువ్ ఎందుకు పట్టించుకోవడం.. ఫీలింగ్స్ ఉండవా..? మాట్లాడడం కూడా తప్పేనా..? 100% నాదే తప్పు అనుకుంటూ'' తనలో తనే మాట్లాడుకుంది ప్రియాంక. 

 

శ్రీరామచంద్రను జైలుకి పంపించకుండా కౌంటర్ ఎటాక్ చేయాలంటూ రవి తన టీమ్ తో డిస్కషన్ పెట్టాడు. ఫైనల్ గా అందరూ కలిసి కాజల్ ని వరస్ట్ పెర్ఫార్మర్ గా చేయాలని ఫిక్స్ అయ్యారు. 

 

కాజల్ సింపతీ కార్డ్ ప్లే చేస్తుందని.. వరస్ట్ పెర్ఫార్మర్ గా కాజల్ సెలెక్ట్ అవుతుందని ఆమెకి కూడా తెలుసని రవి అన్నాడు. 'అలాంటి అమ్మాయి ఎవరికోసమైనా ఏడుస్తాదా..? తను ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చింది.. ఎవరికైనా ఎమోషనల్ గా కనెక్ట్ అయినా.. కూడా ఏడవదు. తనకు ఏం చేయాలో.. చేయకూడదో బాగా తెలుసు' అంటూ యానీ మాస్టర్ తో అన్నాడు రవి. 

 

వరస్ట్ పెర్ఫార్మర్.. 

 

ఇంట్లోని సభ్యులంతా తాము ఎవరిని దోషిగా అనుకుంటున్నారో చెప్పమని అడిగారు బిగ్ బాస్. వారిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని జైలుకు పంపిస్తారు.

 


  • శ్వేతా - కాజల్ ని సెలెక్ట్ చేస్తూ.. 'నాకు, సన్నీ, యానీ మేడం మధ్య స్నేహం ఉంది.. టాస్క్ వల్ల మేమేం మారిపోము.. దయచేసి ఇన్ఫ్లుయెన్స్ చేయకండి' అని రీజన్ ఇచ్చింది. 

  • జెస్సీ - ''ఎవరి ఫుడ్ వాళ్లు వండుకోమని తనతో అనడం నాకు నచ్చలేదు. నాకు కుకింగ్ రాదు, నన్ను కుకింగ్ కి రమ్మంటారేంటి?' అంటూ శ్రీరామ్ తో వాదించాడు జెస్సీ.

  • షణ్ముఖ్ - విశ్వని సెలెక్ట్ చేసుకొని.. కెప్టెన్సీ టాస్క్ లో ఇష్టమొచ్చినట్లు అరవడం, చిల్లర్ అని అనడం నచ్చలేదని రీజన్ చెప్పాడు.

  • హమీద - కెప్టెన్సీ టాస్క్ లో ఫ్లిప్ అవ్వడం నచ్చలేదని కాజల్ ని వరస్ట్ పెర్ఫార్మర్ గా సెలెక్ట్ చేసింది.

  • సిరి - విశ్వను సెలెక్ట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్ లో కోపంలో మాట్లాడిన పదాలు నచ్చలేదని రీజన్ చెప్పింది. 

  • శ్రీరామచంద్ర - కాజల్ ని సెలెక్ట్ చేస్తూ.. జెస్సీతో గొడవ పెద్దది కావడానికి కారణం నువ్వే అంటూ వరస్ట్ పెర్ఫార్మర్ గా ఆమెని ఎన్నుకున్నాడు 

  • కాజల్ - శ్రీరామచంద్ర ని సెలెక్ట్ చేస్తూ.. ఏదో పురుగుని చూసినట్లు చూస్తున్నావ్ అంటూ రీజన్ చెప్పింది.

  • యానీ మాస్టర్ - పాజిటివ్ వైబ్ రావడం లేదని కాజల్ ని సెలెక్ట్ చేసింది.

  • ప్రియాంక - కెప్టెన్సీ టాస్క్ లో వాడిన పదాలు నచ్చలేదని రీజన్ చెప్పింది.

  • లోబో - కెప్టెన్సీ టాస్క్ లో రవిని వెన్నుపోటు పొడవడం నచ్చలేదని కాజల్ ని సెలెక్ట్ చేశాడు.

  • రవి - కాజల్ ని సెలెక్ట్ చేస్తూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని, 'ఎవరిమీద చెయ్యెత్తకు, నొప్పయితది, పద్ధతి తెలుసుకో' అంటూ రవి అనగానే 'నువ్వు నాకు పద్దతులు నేర్పక్కర్లేదు' అంటూ వాదించింది కాజల్. దానికి రవి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా 'నీ పీరియడ్లు క్లాసులో పెట్టుకో ఈడ కాదు' అంటూ రవి మధ్యలోనే కాజల్ ని మాట్లాడనివ్వకుండా చేశాడు.

  • మానస్ - శ్రీరామచంద్ర ని సెలెక్ట్ చేస్తూ.. సంచాలక్ గా నీ ప్రవర్తన నచ్చలేదని రీజన్ చెప్పాడు.

  • సన్నీ - శ్రీరామచంద్రను సెలెక్ట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్ లో 'మట్టిలో మల్లయుద్ధం' టాస్క్ కావాలనే ఆడలేదని.. అలానే జెస్సీని కావాలనే కొట్టాడని రీజన్ చెప్పాడు.

  • విశ్వ - కాజల్ ని సెలెక్ట్ చేశాడు.

  • ప్రియా - విశ్వని సెలెక్ట్ చేశాడు. 


వరస్ట్ పెర్ఫార్మర్ గా కాజల్ కి ఎక్కువ ఓట్లు పడడంతో ఆమెని జైల్లో పెట్టారు. అనంతరం జైల్లో ఉన్న కాజల్ బాధ పడుతుండగా.. కావాలనే కార్నర్ చేశారని జెస్సీ, మానస్ లు అన్నారు.