మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తారలు ఎటువైపు ఉన్నారనే విషయం మరో రెండు రోజుల్లోనే తేలిపోనుంది. ఆదివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లో జరగనున్న ఎన్నికల్లో ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ప్యానల్ సభ్యులు సీనియర్ నటీనటుల మద్దతు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్‌ను మా సభ్యులు సత్కరించారు. 


ఈ కార్యక్రమానికి మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో మా అబ్బాయి మంచు విష్ణు పోటీ చేస్తున్నాడని, అతడికి ఓటేసి గెలిపించాలని మోహన్ బాబు కోరారు. కోటా స్పందిస్తూ.. ‘‘విష్ణుకు ఓటేయాలని మీరు అడగాల్సిన అవసరం లేదు. అధ్యక్షుడయ్యే అర్హత అతడికి ఉంది. కానీ, నేను ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. అతడితో నేను 15 సినిమాలు చేశాను. ఆయన ఏ సినిమాకీ ఒక్క రోజు కూడా సమయానికి రాలేదు. కాబట్టి మనం కొంచెం ఆలోచించి ఓటేయాలి. లోకల్-నాన్ లోకల్ అనే విషయాన్ని పక్కన పెడితే.. విష్ణుకు ఓటేసి గెలిపించండి’’ అని కోటా అన్నారు. 


‘మా’ ఎన్నికలపై స్పందించిన రోజా: ‘మా’ ఎన్నికలపై గొడవలపై తారలు కూడా ఆచీతూచి స్పందిస్తున్నారు. కొందరు బాహాటంగా తమ మద్దతు వారికేనంటూ ప్రకటించినా.. మరికొందరు మాత్రం తమ ఓటు ఎవరికనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. తాజాగా నటి, నగరి ఎమ్మెల్యే రోజా సైతం.. ‘మా’ ఎన్నికలపై స్పందిస్తూ.. ఈ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికల్లా వాడీ వేడిగా ఉన్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో వేలు పెట్టాలనుకోవడం లేదని, అందులో సభ్యురాలిగా తన ఓటు హక్కును మాత్రం సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నారు.


వీడియో:



Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!


Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్


Also Read: మహిళల్ని క్వశ్చన్ చేసినట్టు మగవారిని ఎందుకు ప్రశ్నించరు..సమంత పోస్ట్ వైరల్


Also Read: క్రిష్‌‌తో సినిమా అనగానే ఒప్పేసుకోమన్నా.. ‘కొండ పొలం’పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు 


Also Read:అమ్మకు ప్రేమతో.. జాన్వీ చేతిపై ఈ టాటూ ప్రత్యేకత తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి