‘మా’ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్‌‌ రెండుగా చీలిపోయింది. ఈ సారి ప్రకాష్ రాజ్.. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ‘నాన్ లోకల్’కు ఓటేస్తారా? లేదా ‘లోకల్’కు ఓటేస్తారా అంటూ విష్ణు వర్గం ప్రచారం చేస్తోంది. గురువారం సీనియర్ నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు.. ప్రకాష్ రాజ్ వర్గీయులను ఆగ్రహానికి గురిచేశాయి. అధ్యక్షుడి పదవిలో తెలుగువాడే ఉండాలని, మంచు విష్ణు మాత్రమే కళాకారులకు న్యాయం చేయగలడని నరేష్ పేర్కొన్నారు. ఇక్కడ సరైన నటులు లేరు కాబట్టి నేను వచ్చానని ప్రకాష్ రాజ్ అన్నారని, ఆ మాటలు తనని బాధించాయని నరేష్ అన్నారు. ఎన్టీఆర్ వంటి మహానటుల రక్తం మనలో లేదా? నరేష్ ప్రశ్నలు సంధించారు. దీనిపై ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 


నరేష్‌వి దిగజారుడు మాటలు: ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘నరేష్ నేను చెప్పని మాటలను చెప్పి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. నరేష్ అబద్దాలు చెప్పకండి. అసత్య ప్రచారాలను మానుకొని.. ‘మా’కు మీరు ఏం చేశారు? ఏం చేయబోతున్నారో చెప్పండి. 25 సంవత్సరాల నుంచి నేను ‘మా’లో సభ్యుడిని. రెండు మూడు సార్లు మాత్రమే ఓటు వేయలేదు. నన్ను నాన్ లోకల్ అంటున్న మనిషికి సిగ్గుండాలి. మనిషి జన్మంటేనే ఒక చోటు నుంచి మరోచోటుకు వెళ్లడం. నాన్ లోకల్ అనే అభ్యంతరం ఉంటే సభ్యుడిగా చేర్చుకోకూడదు. చట్టంలో కూడా నాన్ లోకల్ పోటీ చేయకూడదని లేదు. ఇది ప్రజాస్వామ్యం.. 900 మంది డిసైడ్ చేస్తారు. మీరు ఎంత వాగినా వారే నిర్ణయిస్తారు. నేను రెండు నేషనల్ అవార్డులు తెచ్చారు. వీరు ఎవరైనా తెచ్చారా? తెలుగు సినిమా గర్వించే పని చేశాను. తెలుగు సాహిత్యం మీద ఏ చర్చ పెట్టినా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాను. 


ఆ ఫ్యామిలీకే క్రమశిక్షణ ఉందా?: ఒక ఫ్యామిలీ.. ఒక ఫ్యామిలీ అని డబ్బా కొట్టడమే గానీ.. మిగతా ఫ్యామిలీకి క్రమశిక్షణ ఉండదా? మంచు ఫ్యామిలీ కావాలా? మంచి ప్యానెల్ కావాలా? అదొక్కటే క్రమశిక్షణ గల కుటుంబమా? మిగతావాళ్లు రోడ్డు మీద పడి తిరుగుతున్నారా? వెటకారం వద్దని అనుకున్నా. కానీ, వాళ్లు ఇలా మాట్లాడేలా చేస్తున్నారు. 


Also Read: రిపబ్లిక్ సమీక్ష: ఆలోచింపజేసే అరుదైన సినిమా.. అయితే?


పవన్ కళ్యాణ్‌తో విభేదాలున్నాయి: ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్ వైపా? ఇండస్ట్రీ వైపా? అని మంచు విష్ణు ప్రశ్నించడంపై స్పందిస్తూ.. ‘‘పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ కాదా? పవన్ కళ్యాణ్‌ను మీరు పక్కన పెట్టేశారా? ముందుగా ఆయన మా సభ్యుడు.. ఆ తర్వాత రాజకీయ నాయకుడు. ఆయనకు, జగన్‌కు ఎన్నో ఉంటాయి. సినిమా సమస్యలు గురించే పవన్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో అంత ఉండదు మీ సినిమా బడ్జెట్. పవన్ అడిగింది ఇండస్ట్రీ సమస్యలే. నేను ఎవరు పక్కన ఉన్నానని వారు అడగడం ఎందుకు? మా ఎన్నికలు జరుగుతున్నప్పుడు.. దాని గురించి మాట్లాడాలి. నాకు పవన్ క్లోజ్ ఫ్రెండ్ కాదు. రాజకీయ పరంగా మా మధ్య విభేదాలు ఉన్నాయి. అయినా కలిసి సినిమాలు చేస్తున్నాం. సినిమాల్లో ఆయనే బద్రి.. నేను నంద అంతే. పవన్ ఇండస్ట్రీలో లేరా? ఆయన కూడా మన సిద్ధాంతాలు, భావాలు వేర్వేరని అన్నారు. ఇందులోకి పవన్‌ను ఎందుకు లాగుతున్నారు? 


Also Read: పోసాని ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్.. అతడి చావు భయంకరంగా ఉంటుంది: బండ్ల గణేష్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి