టాలీవుడ్ టికెట్ల విక్రయంపై చెలరేగిన వివాదం.. అనేక మలుపులు తిరుగుతూ.. పవన్ Vs పోసానిగా మారింది. ఇటీవల పవన్ కళ్యాణ్ అభిమానులు తన కుటుంబికులను దుర్భషలాడుతున్నారంటూ విలేకరుల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌పై పోసాని వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. దీంతో పవన్ అభిమానులు పోసానిపై గుర్రుగా ఉన్నారు. 


అయితే, పవన్‌ వీరాభిమాని, నిర్మాత బండ్ల గణేష్.. ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన ‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీగా నిలబడిన నేపథ్యంలో ఇన్ని రోజులు మౌనం వహించినట్లు తెలిసింది. అయితే శుక్రవారం బండ్ల గణేష్ పోటీ నుంచి తప్పుకుని.. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు మద్దతు తెలిపాడు. శుక్రవారం ప్రకాష్ రాజ్‌తో ఓటీవీ చానెల్ జరిపిన ఇంటర్వ్యూ మధ్యలో బండ్ల గణేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా పోసానీ వ్యాఖ్యలపై బండ్ల స్పందిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. 


ఆ టీవీ స్టూడియోలో ఉన్న ప్రకాష్ రాజ్‌కు మద్దతు తెలుపుతూ.. తాను పోటీ చేయకపోయినా.. పేద కళాకారులకు డబుల్ బెడ్ రూమ్‌లు కట్టి ఇస్తాననే హామీకి మాత్రం కట్టుబడి ఉంటానని తెలిపారు. ప్రకాష్ రాజ్‌ను ముందుంచి ఆ హామీని నెరవేరుస్తానని తెలిపారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. అది మంచి పనే కదా, తగిన ప్లాన్‌, నిధులతో వస్తే తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పారు.


Also Read: ఆ రోజు నాకు వైద్యం చేసింది అల్లు రామలింగయ్యే.. రాజమండ్రిలో చిరు చిట్‌చాట్


పోసాని వ్యాఖ్యలపై బండ్ల స్పందిస్తూ.. ‘‘పోసాని ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్ లాంటోడు. అతడు 83 ఏళ్ల పవన్ కళ్యాణ్ తల్లి గురించి దారుణంగా మాటలు అన్నాడు. ఒక మెగాస్టార్, పవర్ స్టార్‌కు జన్మనిచ్చి.. ఇంతమందికి కూడు పెడుతున్న కుటుంబాన్ని అనకూడని మాటలన్నాడు. ఆ తల్లిని అంత మాటన్న పోసాని చావు భయంకరంగా ఉంటుంది. ఆమె ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అన్నారా? పవన్‌ను ఎంతైనా తిట్టుకో.. కానీ, ఆయన కుటుంబం, పిల్లలు, ఇంట్లోవారి గురించి తప్పుగా మాట్లాడతావా? పోసాని ఎవరు అధికారంలో ఉంటే వారి చంక నాకుతాడు’’ అని మండిపడ్డారు. 


Also Read: పవన్, పోసాని వివాదంపై స్పందించిన నాగబాబు.. ఫన్నీ మీమ్స్‌తో సమాధానం


Also Read: ‘మా’ వారసుడు మంచు విష్ణు.. తెలుగోళ్లే పోటీ చేయాలి.. ఎవడు పడితే వాడు ఆ సీట్లో కూర్చుంటే..: నరేష్ వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి