అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మరిన్ని మొబైల్ ఆఫర్లను అమెజాన్ టీజ్ చేసింది. 2019లో లాంచ్ అయిన ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ రూ.40 వేలలోపు ధరకే అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ తన అధికారిక మైక్రోసైట్లో పేర్కొంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్ ఫోన్ ధరను రూ.12,999 నుంచి రూ.9,499కు తగ్గించారు. బ్యాంక్ ఆఫర్‌తో రూ.8,550కే దీన్ని కొనుగోలు చేయవచ్చు.


దీంతోపాటు వన్‌ప్లస్ 9ఆర్ 5జీ ఫోన్ ధర రూ.34,999 నుంచి ప్రారంభం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆఫర్ ద్వారా రూ.6,120కే రెడ్‌మీ 9ఏ కొనేయచ్చు. ఐకూ జెడ్3 రూ.15,490 నుంచి ప్రారంభం కానుంది. రెడ్‌మీ నోట్ 10 ప్రోను రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు.


వన్‌ప్లస్ 9 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపును అందించారు. రూ.39,999కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మీ 9 స్మార్ట్ ఫోన్ ధర రూ.7,920కు తగ్గనుంది. ఐఫోన్ ఎక్స్ఆర్ ధర కూడా భారీగా తగ్గించారు. ఈ ఫోన్ అయితే రూ.32,999కే కొనేయవచ్చు.


Also Read: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. రూ.4 వేలకు పైగా తగ్గింపు.. ఫీచర్లు అదుర్స్!


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆఫర్‌తో రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ రూ.17,499కే లభించనుంది. దీంతోపాటు ఒప్పో ఏ31, టెక్నో స్పార్క్ 7టీ, శాంసంగ్ నోట్ 20, శాంసంగ్ నోట్ 20 అల్ట్రా, ఒప్పో ఏ74 5జీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ, రెడ్‌మీ నోట్ 10 ఎస్ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు అందించనున్నాయి.


దాదాపు అమెజాన్‌లో ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్లపై అయితే తగ్గింపు లేదా బ్యాంకు ఆఫర్లు వర్తించనున్నాయి. దీంతోపాటు ప్రైమ్ మెంబర్ షిప్ ఉంటే మరిన్ని ఆఫర్లు అందించనున్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు కొనుగోలు ప్రైమ్ సభ్యులకు వన్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్, ఎక్కువ నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు లభించనున్నాయి.


ఈ సేల్ అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ప్రైమ్ సభ్యులకు మాత్రం ఒక్కరోజు ముందుగానే అక్టోబర్ 2వ తేదీన ఈ సేల్ మొదలవనుంది. 


Also Read: హోం అప్లయన్సెస్‌పై భారీ ఆఫర్లు.. ఇంట్లో వస్తువులు కొనడానికి రైట్ టైం!


Also Read: ఫర్నీచర్ ఉత్పత్తులపై 70 శాతం వరకు ఆఫర్లు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి