దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’ ఇదే కాలక్రమంలో దసరాగా వాడుకలోకి వచ్చింది. శరన్నవరాత్రుల సందర్భంగా...
శ్లోకాల ద్వారా శుభాకాంక్షలు చెప్పాలనుకునేవారికి...
శైలపుత్రి:
వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్!, వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్!!..
బాలాత్రిపుర సుందరీదేవి:
హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం; త్రినేత్రోజ్జ్వలామ్ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్!!
గాయత్రిదేవి
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్ముఖై స్త్రీక్షణైః యుక్తామిందుని బద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీ భజే.
లలితాదేవి
ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం, బింబాధరం పృథులమౌక్తిక శోభినాసమ్; ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం, మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్!
అన్నపూర్ణాదేవి
ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ, నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ; సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ.. భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
మహాలక్ష్మి
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం; శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం, త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
సరస్వతీదేవి
యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా, యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా, సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా.
దుర్గాదేవి
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే.
మహిషాసుర మర్థిని
మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా, జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ
రాజరాజేశ్వరి దేవి
అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ, బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా, చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ.
వాక్యాల్లో శుభాకాంక్షలు చెప్పాలనుకునే వారికోసం
1.చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు,
2.మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ విజయదశమి సకల శుభాలు అందించాలాని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు
3.దుర్గమ్మ చల్లని దీవెనలతో అన్ని సమస్యలు తీరిపోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
4.ఈ దసరా ఆయురారోగ్య విజయాలను అందిచాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు
5.ఈ దసరా పండుగ మీ కుటుంబానికి సకల శుభాలను చేకూర్చాలని, మీ ఇంట సిరి సంపదలతో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.
6.చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు
7.జగన్మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ విజయ దశమి శుభాకాంక్షలు
8. మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి మనలోని దుర్గుణాలపై విజయం సాధించడమే విజయదశమి అంతరార్థం. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు!
9. ఆ దుర్గామాత మీ కోర్కెలన్నీ నెరవేర్చి అన్నింటా విజయాన్ని అందించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
Also Read:విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read:ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజులు రోజుకో నైవేద్యం...ఏ రోజు ఏం పెట్టాలంటే...
Also Read: నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ రంగు వస్త్రం సమర్పించాలి...ఏ ప్రసాదం నివేదించాలి
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి