పాతబస్తీలోని రౌడీలకు అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ప్రజలను వేధిస్తే ఊరుకోనంటూ హెచ్చరించారు. పాతబస్తీలో రౌడీయిజం చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాంటి వారు పాత బస్తీ వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి రౌడీ గ్యాంగ్‌లను ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్ పాత బస్తీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: ఏపీకి వర్ష సూచన, కొన్ని చోట్ల భారీ వానలకు ఛాన్స్.. తెలంగాణలో ఇలా..
ఉత్తర్ ప్రదేశ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అసదుద్దీన్ ఒవైసీ మళ్లీ ఆ పని చేశారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆయన ఆ క్రమంలో మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. మత రాజకీయాలు లక్ష్యంగా తరచూ వ్యాఖ్యలు చేసే ఒవైసీ, హైదరాబాద్‌లోని చార్మినార్ కట్టడాన్ని తన తండ్రితో పోల్చారు. అది మా తండ్రి భవనం అని, ఇక్కడ తమతో కలిసి బీజేపీని తరిమికొట్టడానికి ప్రయత్నిద్దామని యూపీలో పిలుపునిచ్చారు. భారతదేశంలో ముస్లింల పరిస్థితి రోజురోజుకు బ్యాండ్ ప్లేయర్స్ లాగా మారిందని పేర్కొన్నారు. భారతదేశంలో ప్రధాని మోదీ ఎన్నికల సమయం వరకూ ముస్లింను కలిపి ఉంచుకుంటారని.. ఆ తర్వాత వేరు చేసేస్తారని వ్యాఖ్యలు చేశారు..
మోదీ, యోగిని టార్గెట్ చేసిన ఒవైసీ
యూపీ ఎన్నికలు లక్ష్యంగా ఒవైసీ ప్రధాని మోదీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తన ఇలాకాలో బీజేపీని ఓడించడంలో తనకు సహాయం చేసిన హైదరాబాద్ ప్రజలకు లక్షల వందనాలు అని ఆయన అన్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ప్రధాని మోదీ స్వయంగా వచ్చారని, ముఖ్యమంత్రి యోగి కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చారని ఒవైసీ చెప్పారు. 5 నెలల తర్వాత జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడు ముస్లింలు తామ నాయకుడిగా మారాలా లేదా ఓటరుగా మారాలా అనేది నిర్ణయించుకోవాలని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ముస్లిం సామాజికవర్గ జనాభా ఏ విధంగానూ తక్కువ కాదని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత ముస్లింలను పట్టించుకోకపోవడం వల్ల వారికి ప్రాతినిథ్యం లేకుండా పోతోందని, అందుకే ముస్లింల దుస్థితి దారుణంగా మారిందని వ్యాఖ్యలు చేశారు.
Also Read: Smart Phone eVoting: స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ-ఓటింగ్.. దేశంలో మొదటిసారిగా తెలంగాణ నుంచే అమలు..