తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలో రానున్న 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అన్ని జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.


బుధవారం (అక్టోబరు 6)న హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. రాగల 24 గంటల్లో వాతావరణం ఇలా ఉంటుంది. ‘‘తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలుక అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంటుంది.’’ అని వివరించారు.  వర్షాలకు సంబంధించి అధికారులు హెచ్చరికల్లాంటివి ఏమీ విడుదల చేయలేదు.


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
‘‘ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులకు సంబంధించి వాతావరణ వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం శుక్రవారం ట్వీట్ చేసింది. ఆగస్టు 14న ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 15, 16 తేదీల్లో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.


ఆగస్టు 14న దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఇవాల్టి (ఆగస్టు 14) నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది’’ అని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకుడు వెల్లడించారు.


ఏపీలో వాతావరణం ఇలా..
నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలోని ఉపరితల ఆవర్తనం ఈరోజు కోస్తా తమిళనాడు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది పైకి వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి కొనసాగుతుందని వివరించారు. తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి కోస్తా తమిళనాడులో గల ఉపరితల ఆవర్తనం నుండి ఆగ్నేయ అరేబియా సముద్రము వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ నుంచి 3.1 కి.మీ ఎత్తుల మధ్య కొనసాగుతుంది.


దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.


Also Read: మళ్లీ భారీగా ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కొద్దిరోజులుగా తగ్గని రేట్లు, తాజా ధరలు ఇలా..


దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శుక్రవారం దక్షిణ కోస్తా ఆంధ్రలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. శనివారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


Also Read:ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజులు రోజుకో నైవేద్యం...ఏ రోజు ఏం పెట్టాలంటే...


రాయలసీమలో ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.


Also Read: దిగొచ్చిన పుత్తడి, స్వల్పంగా పెరిగిన వెండి..ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలివే...


Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి