‘మా’ ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగే పరిస్థితి నెలకొంది. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు చెందిన నటి హేమా ఏకంగా మంచు విష్ణు ప్యానల్‌‌కు చెందిన శివ బాలాజీ చేయి కొరికిందనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేగాక నరేష్, ప్రకాష్ రాజ్‌ల మధ్య కూడా వాగ్వాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. చివరికి ఒకరిపై ఒకరు రిగ్గింగ్ ఆరోపణలు చేసుకోవడంతో పోలింగ్‌ను ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. సీసీటీవీ వీడియోలు పరిశీలించిన తర్వాతే పోలింగ్ కొనసాగిస్తామని ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటించారు. 


ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ మంచు విష్ణు ప్యానల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇరు ప్యానల్ వ్యక్తుల మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ అభ్యర్థి నటి ప్రగతి పోలింగ్ కేంద్రం వద్ద మంచు విష్ణు అభ్యర్థితో గొడవపడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. అలాగే.. ప్రకాష్ ప్యానల్ అభ్యర్థి హేమా.. శివబాలాజీ చేయి కోరికింది. దీంతో శివబాలాజీ ఆమెను కోపంగా చూశాడు. ఈ వీడియో మీడియాకు చిక్కడంతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. నరేష్ కూడా శివబాలాజీ చేతిని మీడియాకు చూపిస్తూ.. హేమ కొరికిందని ఆరోపించారు. అయితే, శివబాలాజీ ఏమీ జరగలేదని తెలిపారు. దీనిపై హేమా స్పందిస్తూ.. పది మంది ఒక అబ్బాయిని కొట్టబోతుంటే అడ్డుకోడానికి వెళ్లాను. శివబాలాజీ తనను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో కొరకాల్సి వచ్చిందని హేమా తెలిపారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం శివ బాలాజీ హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందుతున్నారు. వైద్యులు టీటీ, యాంటిబయొటిక్స్ ఇచ్చారని ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. వాటిని ఇక్కడ చూడండి.


















Also Read: ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!


ప్రకాష్ రాజ్‌కు విష్ణు హగ్: ఎన్ని గొడవలున్నా.. మేము.. మేము ఒకటే అన్నట్లుగా కలిసిపోయారు. మోహన్ బాబు ఎదురు కాగానే ప్రకాష్ రాజ్ ఆయన కాళ్లకు మొక్కేందుకు ప్రయత్నించారు. మోహన్ బాబు వద్దని వారించి.. తన కొడుకు మంచి విష్ణుతో షేక్ హ్యాండ్ ఇప్పించారు. దీంతో విష్ణు, ప్రకాష్ రాజ్ హగ్ చేసుకున్నారు.


బెనర్జీకి మోహన్ బాబు వార్నింగ్: మా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వచ్చి ఓటు వేసి వెళ్లారు. అయితే ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య పోలింగ్ కేంద్రం వద్ద వివాదం నెలకొంది. రిగ్గింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎన్నికల అధికారి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే ఇరు వర్గాల మధ్య పోలింగ్ కేంద్రంలో మాటా మాటా పెరిగింది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ విమర్శలు చేసుకున్నా్రు.  అయితే ఈ వాగ్వాదం మధ్యలో బెనర్జీని చంపేస్తానంటూ మోహన్ బాబు హెచ్చరించినట్టు తెలుస్తోంది. 


Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!


Also Read: 'మా' ఎన్నికల్లో ఓటేసిన పవన్ కల్యాణ్.. అది అవసరమా అనిపించింది అంటూ కామెంట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి