తమిళనాడులో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. మూఢ నమ్మకాలు కొంత మందిలో ఏ స్థాయిలో ఉన్నాయో చాటే ఘటన ఇది. చనిపోయిన వ్యక్తిని అంత్యక్రియలకు తీసుకుపోకుండా కుమార్తెలు ప్రార్థనలు చేయడం పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా.. వారు చెప్పిన సమాధానం విని అంతా విస్తుపోయారు. పూర్తి వివరాలివీ..


Also Read: ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..


ఓ వృద్ధురాలు చనిపోవడంతో ఆమె శవం దగ్గర కూర్చుని ఆమె ఇద్దరు కుమార్తెలు ప్రార్థనలు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని మణపారై సమీపంలో ఉన్న చొక్కంపట్టి వీజీపీ ఫ్లాట్‌కు చెందిన మేరీ అనే 75 ఏళ్ల వృద్ధురాలు చనిపోయింది. ఆమె భర్త 20ఏళ్ల క్రితమే చనిపోయాడు. వీరికి ఇద్దరు కూతుర్లు జయంతి (43), జెసిందా (40) ఉండగా.. ఇద్దరికీ ఇంకా వివాహం కాలేదు. ఈ క్రమంలో తల్లి చనిపోవడంతో ఆమె ఇద్దరు కుమార్తెలు వింతగా ప్రవర్తించారు.


Also Read: లవర్ ని పార్క్ తీసుకెళ్లడం విన్నాం.. కానీ ఈ మహానుభావుడు ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా?


ఏకంగా ఆ ఇంటి నుంచి 2 రోజులుగా ప్రార్థనలు చేసినట్లుగా పెద్దగా శబ్దాలు వినిపించాయని స్థానికులు వెల్లడించారు. దీంతో వారు మణపారై పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ కరుణాకరన్‌ తదితరులు అక్కడికి చేరుకున్నారు. రెండు రోజుల కిందట మేరి చనిపోయిందని, ఆమె శవాన్ని ఇంట్లో ఉంచుకుని కుమార్తెలు ప్రార్థనలు చేస్తున్నారని విచారణలో బయటపడింది. పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా.. వారిని లోనికి రాకుండా ఇద్దరు కుమార్తెలు అడ్డుకున్నారు. తల్లి మరణించలేదని, ఆమెను చంపడానికి చూస్తున్నారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి 108 సిబ్బంది ప్రయత్నించగా గొడవకు దిగారు. ప్రార్థనలు చేస్తే తల్లి తిరిగి బతుకుతుందని పోలీసులతో చాలా సేపు వాదించారు. 4 గంటల తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మనపారై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడకు కూడా వెళ్లిన కుమార్తెలు డాక్టర్లతో కూడా గొడవకు దిగారు.


Also Read: యువతి సమయస్ఫూర్తి.. దిశా యాప్ ద్వారా ఆకతాయి ఆట కట్టించిన పోలీసులు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి