ఆంధ్రప్రదేశ్‌లో రూ. పది, ఇరవై వేలకే ఇంటి పట్టాను ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇక్కడ పట్టాలు మాత్రమే ఇస్తారు. ఇళ్లు కాదు. అంటే.. ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నవారు లేదా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకుని కట్టుకున్న వారు మాత్రమే అర్హులు. అంటే ఇప్పటికే ప్రభుత్వ ఇచ్చిన ఇళ్ల లబ్దిదారులు లేదా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఇల్లు కట్టుకున్న వారు మాత్రమే అర్హులు. వారందరూ తమ తమ సొంత ఇళ్లల్లో ఉంటున్నప్పటికీ వారి పేరు మీద ఇంటి పట్టాలుండవు. యాజమాన్య హక్కులు లేవు. ఇలాంటి వారందరికి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం రూ. పది, ఇరవై వేలతోనే పని పూర్తి చేయాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాలంటీర్లు అదే పనిలో ఉన్నారు. ప్రస్తుతం వాలంటీర్లు సర్వేలో బిజీగా ఉన్నారు. గ్రామాల్లో తిరిగి ఇళ్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అందులో ప్రధానమైన ప్రశ్నలు ఉంటున్నాయి. మీరు ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన స్థలం లో ఇల్లు కట్టుకున్నారా..? కట్టుకుని ఉంటే.. మీ పేరున పట్టా లేకపోతే రూ. 20,000 కడితే వెంటనే పట్టా వస్తుంది అని చెబుతున్నారు. ఒకవేళ మీరు పోరంబోకు, గ్రామ కంఠం భూమిలో ఇల్లు కట్టుకుని ఉన్నా రూ. 10,000 కడితే పట్టా ఇప్పిస్తామని వాలంటీర్లు చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఎవరి వద్ద అయినా కొనుక్కున్నా పర్వాలేదు రూ.20,000 కట్టండి మీ పేరున పట్టా ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు. వివరాలు సేకరిస్తూ ఇంటి పన్ను రసీదులు కూడా తీసుకుంటున్నారు.
ప్రభుత్వం ఇటీవల వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని కేబినెట్‌లో ఆమోదించింది. హౌసింగ్ లోన్ల భారంతో కట్టలేకపోయిన 46 లక్షల మందిని గుర్తించారు. వారందరికీ వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు మున్సిపాలిటీల్లో రూ.30 వేల వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద చెల్లించి పేదలు ఇళ్ల రుణాల నుంచి విముక్తి కావొచ్చు. అయితే రుణం బాగా తక్కువ తీసుకున్న వారికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పేదలకు 1983 నుంచి ఏపీలో హౌసింగ్ కార్పొరేషన్ పేరు మీద ఇళ్లు ఇస్తున్నారు. సగం సొమ్ము సబ్సిడీగా మిగతా సగం సొమ్ము లబ్దిదారులు రుణంగా ఇళ్లు ఇస్తారు. ఆ సగం సొమ్మును లబ్దిదారులు పది లేదా ఇరవై ఏళ్ల వాయిదాల్లో చెల్లించాలి.
Also Read: విద్యుత్ ట్రూ అప్ చార్జీలపై ఏపీ సర్కార్‌లో గందరగోళం ! నిన్న రద్దు... మళ్లీ వచ్చే నెల నుంచి వసూలు ?
అయితే ఇళ్లను తీసుకుంటున్న లబ్దిదారులు చెల్లించడం లేదు. ప్రభుత్వాలు కూడా లైట్ అడగడం మానేశాయి. దాంతో ఆ లోన్లు అలాగే ఉండిపోయాయి. ఆ ఆస్తులపై యాజమాన్య హక్కులు లోన్ పూర్తి కాకపోవడం వల్ల వారిపైకి మారలేదు. అందుకే సీఎం జగన్ వారికి వన్ టైం సెటిల్మెంట్ ప్రకటించి వారి వద్ద నుంచి రూ. పది, ఇరవై వైలు వసూలు చేసి రుణవిముక్తుల్ని చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం వాలంటీర్లు వివరాలు సేకరిస్తున్నారు.
Also Read: విద్యుత్ కొరతపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ... యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి