ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ, పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సందర్భం దొరినప్పుడల్లా వైసీపీ సర్కార్ పై పవన్ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ట్విట్టర్ ద్వారా ఏపీ సర్కార్ పై వాగ్బాణాలు సంధించారు. ఏపీలో ఆర్థిక నియంత్రణ లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆదాయం, అప్పులపై పవన్ ట్వీట్ చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఎటుపోతుందో అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నలను సంధించారు. ప్రభుత్వ, రిటైర్డు ఉద్యోగులకు జీతాలు, ఫించన్లు సకాలంలో అందించలేకపోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వస్తాయనే మాటను మర్చిపోయి చాలా కాలం అయిందన్నారు. ఎప్పుడు జీతాలు, పెన్షన్లు వస్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పడమే ఇందుకు కారణమని పవన్ ఆరోపించారు.
Also Read: మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?
ఎంత కాలం ఇలా...
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు అందకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని పవన్ తెలిపారు. దశాబ్దాల పాటు సర్వీస్ చేసిన వారు విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని అనుకుంటారన్నారు. వృద్ధ్యాప్యంలో వైద్య ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయని, ఆ ఖర్చులకు పెన్షన్ ఆధారమన్నారు. పెన్షన్ కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో వారంతా మానసికంగా వేదనకు లోనవుతారని పవన్ అన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసునన్న పవన్.. జీతం, పెన్షన్ తో ఎంతో ఆత్మాభిమానంగా జీవిస్తారన్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతంతో ఉద్యోగులు ప్రణాళికతో ఖర్చు చేసుకుంటాన్నారు. బ్యాంక్ లోన్ల వాయిదాలు, పిల్లల చదువులు, ఖర్చులు, ఇతర అవసరాలు ప్లాన్ చేసుకుంటారన్నారు. సమయానికి జీతం ఇవ్వకపోతే ఎంత కాలం వారు చేబదుళ్లతో జీవితం నెట్టుకుని రావాలని పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Watch Video : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?
ప్రభుత్వ ఆదాయం ఎటు పోతుంది?
నిరంతరం డ్యూటీలో ఉండే పోలీస్ శాఖ సిబ్బందికి 11 నెలల నుంచి టీఏ చెల్లించడం లేదని పవన్ అన్నారు. పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈ విషయాన్ని అనంతపురం జిల్లా కొత్తచెరువు సభలో ప్రస్తావించినట్లు పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకూ 7 డీ.ఏలు బకాయిలు చెల్లించాలని గుర్తుచేశారు. పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. జీతం ఇవ్వడమే ఆలస్యం చేస్తే ఇక డీఏటీఏ, పీఆర్సీలు అడగరని, జీతం వస్తే చాలనుకుంటారని ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వచ్చే అదాయం గత అధిక సంవత్సరం కన్నా పెరిగిందని లెక్కలు చెబుతున్నాయని పవన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ నిర్వహణలో భాగంగా జీతభత్యాల చెల్లింపులు చేయడం లేదంటే ప్రభుత్వ ఆదాయం ఎటు పోతుందని ప్రశ్నించారు.
Also Read: పెళ్లి చేసుకుంటావా? లేదా? సచివాలయ ఉద్యోగికి వేధింపులు.. నెల్లూరు జిల్లాలో ఘటన..
తాకట్టులో ఏపీ
తాకట్టులో ఆంధ్రప్రదేశ్ పేరుతో పవన్ ఒక ఛార్ట్ ను పోస్టు చేశారు. విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను, చెత్త పన్నులను జనసేనాని నవరత్నాలతో పోల్చారు. భావితరాలకు మిగిలేది అప్పులేనన్నారు. కొందరికి మాత్రమే నవరత్నాలు ఇస్తున్నారని తెలిపారు. పన్నులు మాత్రం అందరి నుంచి భారీగా వసూలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో ఆర్థికవృద్ధి అథఃపాతాళానికి చేరిందని ఎద్దేవా చేశారు పవన్.
Also Read: CM Jagan : పాదయాత్రలో చూసి కష్టాలు తీరుస్తున్నా .. ! రెండో విడత ఆసరా నిధులు విడుదల చేసిన సీఎం జగన్ !