89వ భారత వైమానిక దినోత్సవాన్ని ఉత్తర్‌ప్రదేశ్ గజియాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత వాయుసేన అధిపతి వీఆర్ చౌదరీ కీలక ప్రసంగం చేశారు. భారత గడ్డపై విదేశీ శక్తులను కాలుమోపనివ్వబోమని వాయుసేనాని స్పష్టం చేశారు.
ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లను చూస్తే.. నేను సరైన సమయంలో వాయుసేన అధిపతిగా బాధ్యతలు స్వీకరించినట్లు అనిపిస్తోంది. మన భూభాగంలోకి ఏ విదేశీ శక్తిని కాలుమోపనివ్వబోమని ఈ సందర్భంగా దేశానికి వాగ్దానం చేస్తున్నాను.
వైమానిక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన వీరులు, వారు కుటంబాలను అభినందించారు.
వైమానిక దినోత్సవం సందర్భంగా వాయుసేన వీరులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. ధైర్యం, సాహసం, వృత్తి ధర్మంలో వారికి వారే సాటి. సవాళ్లను ఎదుర్కొని దేశాన్ని రక్షించడంలో వారి సేవలు ఎనలేనివి. - ప్రధాని నరేంద్ర మోదీ