హత్య కేసులో డేరా సచ్చా సౌధ చీఫ్ గురుమీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా)ను హరియాణా పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. ఆయన మద్దతుదారుడైన రంజిత్ సింగ్‌ 2002, జులై 10న హత్యకు గురయ్యాడు. ఈ కేసులో డేరా బాబాతో పాటు మరో నలుగురిని ఐపీసీ సెక్షన్ 302 కింద అరెస్ట్ చేశారు. 






ఇప్పటికే జైలు శిక్ష..


ఈ కేసులో రామ్​ రహీమ్​ సింగ్​తో పాటు క్రిష్ణలాల్​, జస్వీర్​, సబ్దిల్​, అవతార్​లు దోషులుగా తేలారు. ప్రస్తుతం డేరా బాబా సునారియా జైలులో ఉన్నారు. నిందితుల్లో ఒకరు ఇప్పటికే మరణించారు.


దోషులకు అక్టోబర్​ 12న శిక్ష ఖరారు చేయనుంది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం కేసులో 2017లో కోర్టు డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.


అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి