ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేస్తున్న యువకుడు సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో పాడు పనిని ఎంచుకున్నాడు. 23 ఏళ్ల ఇతను చైల్డ్ పోర్న్ వీడియోలను అమ్ముతూ డబ్బు సంపాదిస్తున్నాడు. చివరికి గుట్టు బయటపడ్డంతో పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఉమెన్ సేఫ్టీ విభాగం పోలీసులు వివరించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నస్తుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి వి.మధుకర్ రెడ్డి (23). మాదాపూర్‌లోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. నిందితుడు టెలిగ్రాం గ్రూపుల ద్వారా మొత్తం 1,270 చైల్డ్ పోర్న్ వీడియోలను అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గత జూన్ నెల నుంచి వాటి ద్వారా ఏకంగా రూ.60 వేలు సంపాదించినట్లు చెప్పారు. నిషేధానికి గురైన చైల్డ్ పోర్న్ వీడియోలను సబ్‌స్ర్కిప్షన్ ద్వారా పంపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 


Also Read : 'లఖింపుర్ ఖేరీ' కేసులో ఇద్దరు అరెస్ట్.. కేంద్రమంత్రి కుమారుడి కోసం గాలింపు


సైబర్ పోలీసులు సోషల్ మీడియాలో రెగ్యులర్ సైబర్ పెట్రోలింగ్ చేస్తుండగా.. నిందితుడి గురించి తెలిసిందని, మరింత లోతుగా విచారణ జరపగా.. టెలిగ్రామ్ గ్రూపుల గురించి బయటపడిందని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు నిందితుడ్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సర్కిల్ పోలీసులను అలర్ట్ చేసి గురువారం నిందితుడి సొంత ఇంట్లో నుంచే అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పారు. ఇతనిపై పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 15, ఐపీసీ 292, ఐటీ చట్టంలోని 66-ఈ, 67, 67-ఏ కింద కేసులు నమోదు చేశారు.


Also Read: Hyderabad Fraud: ఆ ఫోటోకు టెంప్ట్ అయిన గుంటూరు యువకుడు.. రూ.1.20 కోట్లు హుష్‌కాకీ.. బాధితుడు లబోదిబో..


పోలీసులు గుర్తించిన దాని ప్రకారం.. నిందితుడు దాదాపు 1,270 చైల్డ్ పోర్న్ వీడియోలను ఆరు టెలిగ్రామ్ గ్రూపులు సహా కొన్ని వెబ్‌సైట్లలో అప్ లోడ్ చేశాడు. ప్రాథమిక విచారణలో భాగంగా టెలిగ్రామ్ గ్రూపులు, వెబ్‌ సైట్ల నుంచి తాను పెట్టిన వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవాలంటే.. సబ్‌‌స్ర్కిప్షన్ పెట్టినట్లు గుర్తించారు. టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ వారి నుంచి నిందితుడు ప్రతి 300 వీడియోలు డౌన్ లోడ్ చేసుకొనేందుకు రూ.100 వరకూ ఛార్జి చేస్తున్నాడని, వెయ్యి వీడియోలు డౌన్ లోడ్ చేసుకొనేందుకు మరో రూ.100 వసూలుచేస్తున్నట్లు గుర్తించారు. ఇతని టెలిగ్రామ్ గ్రూపుల్లో దాదాపు 2 వేల మంది వరకూ సబ్‌స్ర్కైబర్లు ఉన్నారని వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు. 


Watch Video : స్పైస్ జెట్ ఎయిర్ హోస్టస్ విమానంలో డ్యాన్స్... నెట్టింట్లో వీడియో వైరల్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి