సాధారణంగా ఎయిర్ హోస్టస్ అంటే ఏం చేస్తుంటారు? విమానం ఎక్కిన ప్రయాణికులు సీటు బెల్టు ఎలా పెట్టుకోవాలి? తదితర సూచనలిస్తారు. మధ్యలో ప్రయాణికులకు కాఫీలు, టీలు, టిఫిన్లు అందిస్తారు. ఇంకా ఏదైనా సాయం కావాలంటే చేస్తారు. ఎయిర్ హోస్టస్ జాబ్ అంటే కాస్త టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ నుంచి విముక్తి పొందడానికి ఈ ఎయిర్ హోస్టస్ ఏం చేసిందో చూడండి. 


Also Read: స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్... మా వాష్ రూమ్స్ వాడొద్దు... రెస్టారెంట్ యాజమాన్యంపై నెటిజన్ల ఆగ్రహం






Also Read: స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లిఫ్ట్స్ వాడొద్దు... మెట్లు ఎక్కి రండి... ఓ మాల్ ఆర్డర్... నెటిజన్ల ఆగ్రహం


ఖాళీగా ఉన్న విమానంలో చక్కగా డ్యాన్స్ చేస్తూ తన టెన్షన్ మొత్తాన్ని వదిలేసింది. స్పైస్ జెట్ విమానయాన సంస్థలో క్యాబిన్ క్రూగా పని చేసే మీనాక్షి ఖాళీగా ఉన్న విమానంలో డ్యాన్స్ చేస్తూ ఓ రీల్ వీడియో చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. బాలీవుడ్ చిత్రం Humse hai Muqabala లోని ఊర్వశి, ఊర్వశి పాటకి ఈమె డ్యాన్స్ చేసింది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మీనాక్షి నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను ఏడు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.   






ఖాళీగా ఉన్న విమానాల్లో క్యాబిన్ క్రూ డ్యాన్స్ వేయడం ఇదే తొలిసారి ఏం కాదు. కొద్ది రోజుల క్రితం ఇండిగో ఎయిర్ హోస్టస్ Manike Mage Hithe సాంగ్‌కి డ్యాన్స్ వేసిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో షికార్లు కొట్టింది. అలాగే మరో ఇండిగో ఎయిర్ హోస్టస్ కూడా KiDi- Touch it పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించింది.  


Also Read: ఒకే కాండానికి 839 టమాటాలు... గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు