కొద్ది రోజుల క్రితం ఉదయ్‌పూర్‌లోని ఓ మాల్ యాజమాన్యం స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించొద్దు అంటూ నోటీసు అంటించింది. శోభన నయ్యర్ అనే జర్నలిస్టు, ట్విటర్ యూజర్ ఈ నోటీసును ఫొటో తీసి నెటిజన్లతో పంచుకున్నారు. గంటల్లోనే వైరల్ అయిన ఈ ఫొటోతో మాల్ యాజమాన్యం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంటే ఎందుకు అంత చిన్న చూపు, వారేం తప్పు చేశారు, బరువులు మోస్తూ వారు మెట్లు ఎలా ? అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, డెలివరీ బాయ్స్‌కి ఎంతో మంది మద్దతు ప్రకటించారు. వెంటనే ఆ నోటీసు తొలగించాలని డిమాండ్ చేసిన సంగతి గుర్తుంది కదూ.


Also Read: స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లిఫ్ట్స్ వాడొద్దు... మెట్లు ఎక్కి రండి... ఓ మాల్ ఆర్డర్... నెటిజన్ల ఆగ్రహం



తాజాగా మరో చోట ఓ రెస్టారెంట్ యాజమాన్యం స్విగ్గీ, జొమాటో (Swiggy and Zomato) డెలివరీ బాయ్స్ తమ రెస్టారెంట్లోని వాష్ రూమ్స్ ఉపయోగించకూడదని నోటీసు అంటించింది. ఓ Reddit user సదరు రెస్టారెంట్ అంటించిన నోటీసును నెటిజన్లతో పంచుకున్నాడు. ‘Corner House Ice Creams’ అనేది ఆ రెస్టారెంట్ పేరు అని పేర్కొన్న ఈ యూజర్ అది ఏ లోకేషన్‌లో ఉందో చెప్పలేదు. ఈ పోస్టు వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆ రెస్టారెంట్ యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Also Read: 14 ఏళ్ల కుర్రోడు... రైల్వేస్టేషన్ ఎదురుగా దహీ కచోరీ అమ్ముతున్నాడు... వీడియో వైరల్... పెరిగిన అమ్మకాలు






డెలివరీ బాయ్స్‌ని లిఫ్ట్‌లో రానివ్వరు, లేట్ డెలివరీ అయితే ఊరుకోరు, ప్యాకింగ్‌లో తేడా ఉంటే ప్రశ్నిస్తాం... మరి ఇలాంటప్పుడు వారు వాష్ రూమ్స్ ఉపయోగించుకోవడానికి సమస్యా, స్విగ్గీ, జొమాటో వర్కర్స్‌కే ఎందుకు ఇలాంటి షరుతులు? అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


Also Read: ఒకే కాండానికి 839 టమాటాలు... గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు


Also Read: ఒక వ్యక్తి.... 5 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు... 6వ సారి రిజిస్ట్రర్ చేసుకున్నాడు


 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి