లండన్‌కి చెందిన 43 సంవత్సరాల స్మిత్ వృత్తి రీత్యా IT మేనేజర్. అయితే, తాజాగా అతడు ఓ ప్రయత్నం చేసి ప్రపంచ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇంతకీ ఆ ప్రయత్నం ఏమిటంటే... ఒకే కాండానికి 839 టమాటాలు కాయించాడు. ఏంటి, ఒకే కాండానికి 839 టమాటాలు కాయడం ఎలా సాధ్యం? అనే కదా మీ సందేహం. కానీ, ఇది నిజం. అవి చెర్రీ టమాటాలు.. అంటే చిన్న టమాటాలు అన్నమాట. తాజా స్మిత్ రికార్డుతో ఇప్పటి రకు గ్రహమ్ ట్రాంటర్ 2010 లో నెలకొల్పిన రికార్డు బద్దలైంది.  గ్రహమ్ అప్పట్లో ఒకే కాండానికి 488 టమాటాలు కాయించాడు. 






ఈ ఏడాది మార్చిలో 8X8 అడుగుల విస్తీర్ణంలో స్మిత్ గింజలు నాటాడు. అవి సెప్టెంబరులో కాయలు కాయడం మొదలుపెట్టాయి. స్మిత్ గింజలు నాటినప్పటి నుంచి ప్రతి రోజూ 3 నుంచి 4 గంటల పాటు అక్కడే సమయం గడుపుతూ వాటికి కావల్సిన పోషణ అందించేవాడు. స్మిత్ దీని పోషణ కోసం ఎంతో స్టడీ చేశాడు. గత వింటర్లో అతడు మొత్తం డేటా సేకరించి ఈ పనిని మొదలుపెట్టాడు. దీంతో ఏ సమయానికి ఏం చేయాలో ఆ విధంగా అందించేవాడు. దీంతో ఒకే కాండానికి 839 చెర్రీ టమాటాలు కాశాయి. స్మిత్ వెంటనే గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారులకు ఈ సమాచారం అందించాడు. వాళ్లు వచ్చి టమాటాలు లెక్కించి మొత్తం సమాచారాన్ని సేకరించి తీసుకెళ్లారు. 


స్మిత్ గిన్నీస్ రికార్డు సాధించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో అతడు UKలోనే టాలెస్ట్ సన్ ఫ్లవర్ చెట్టును పెంచాడు. ఈ చెట్టు ఎత్తు 20 అడుగులు. అంతేకాదు గత ఆగస్టులో 3 కేజీల టమాటాను కూడా కాయించాడు. ఈ పరంగా స్మిత్ యూకే వాసులకు సుపరిచితుడే.