నోకియా జీ10 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5050 ఎంఏహెచ్‌గా ఉంది.


నోకియా జీ10 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.12,149గా నిర్ణయించారు. నైట్, డస్క్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, నోకియా అధికారిక వెబ్ సైట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.


జియో వినియోగదారులు ఈ ఫోన్ కొంటే రూ.1,000 తగ్గింపు లభించనుంది. రూ.11,150కే వారు ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లు, మైజియో యాప్‌ల్లో ఈ ఆఫర్ లభించనుంది. జియో వినియోగదారులకు ఈ ఫోన్ కొనుగోలుపై మరిన్ని ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.


నోకియా జీ10 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను అందించనున్నారు. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. నైట్ మోడ్, పొర్‌ట్రెయిట్ మోడ్ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. వైఫై, 4జీ, బ్లూటూత్ వీ5, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు.


యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5050 ఎంఏహెచ్‌గా ఉంది. దీని మందం 0.92 సెంటీమీటర్లు కాగా, బరువు 197 గ్రాములుగా ఉంది.


Also Read: Moto New Phone: రూ.9 వేలలోపే మోటొరోలా కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: iPhone 13: ఐఫోన్ 13 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం.. కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్!
Also Read: Xiaomi 11 Lite 5G NE: షియోమీ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. సెప్టెంబర్ 29న లాంచ్.. ధర ఎంత ఉండవచ్చంటే?