రష్యాలో కాల్పులు కలకలం సృష్టించాయి. పెర్మ్ స్టేట్ యూనివర్సిటీలో గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో 8 మంది వరకు మృతిచెందారు.
12 మంది వరకు గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు. ఈ మేరకు రష్యా న్యూస్ ఎజెన్సీ టాస్ వెల్లడించింది.
ఏం జరిగింది?
రష్యాలోని పెర్మ్ క్రాయ్ ప్రాంతలో ఉన్న ప్రముఖ పెర్మ్ స్టేట్ యూనివర్సిటీ (పీఎస్‌యూ)లో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 8 మంది వరకు మరణించినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి.
కాల్పుల నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు భవనం కిటికీల్లో నుంచి కిందకు దూకేసిన దృశ్యాలు బయటకి వచ్చాయి. కొంతమంది తరగతి గదుల్లోనే కొంతమంది దాక్కున్నారు. నాన్ లీదల్ గన్‌తో దుండగుడు కాల్పులు జరిపినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.