గత ప్రభుత్వాల హయాంలో సహకార రంగంలోని డెయిరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. జగనన్న అమూల్‌ పాలవెల్లువ, మత్స్యశాఖపై సీఎం జగన్‌ మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారని సీఎం జగన్ అన్నారు. హెరిటేజ్‌కు మేలు చేయడానికి ఏ సహకార సంస్థని సరిగ్గా నడవనీయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సహకార డెయిరీలను ప్రోత్సహించదన్నారు. అమూల్‌ సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చిందన్నారు. అమూల్‌ వచ్చాక లీటరుకు రూ.5 నుంచి రూ.15ల వరకూ అదనపు ఆదాయం వచ్చిందని సీఎం గుర్తుచేశారు. రేట్ల పరంగా పోటీతో పాడిరైతులకు మేలు జరుగుతోందని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. 


గ్రామాల్లో సహకార వ్యవస్థ బలోపేతం


తమ ఆదాయాలు పెంచుకునే మార్గంలో చాలా మంది మహిళలు పాడిపశువులను కొనుగోలు చేశారని సీఎం జగన్ తెలిపారు. మహిళలకు మరింత చేయూత అందించేందుకు బీఎంసీయూలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల పాడి వ్యాపారంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయన్నారు. బీఎంసీయూల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారదర్శక సహకార వ్యవస్థ ద్వారా మహిళలకు మేలు జరుగుతుందన్నారు. గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థబలోపేతం చేయాలని సీఎం జగన్ అన్నారు. చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలి సీఎం అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ-శిక్షణా కరదీపిక పుస్తకాలను సీఎం జగన్‌ మంగళవారం ఆవిష్కరించారు. 


Also Read: 'జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు'.. అంటూ పవన్ కు మంత్రి పేర్ని నాని కౌంటర్ 


ఫీడ్, సీడ్ చట్టాలు పటిష్టంగా అమలు


ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకు ఆక్వాహబ్‌లు, రిటైల్‌ వ్యవస్థలను తీసుకు వస్తున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. సరిగ్గా పంట చేతికి వచ్చే నాటికి దళారులు సిండికేట్‌ అయ్యి రేట్లు తగ్గిస్తున్నారన్నారు. ప్రాసెసింగ్‌ చేసేవాళ్లు, ఎక్స్‌పోర్ట్‌ చేసేవాళ్లు సిండికేట్‌ అవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారన్నారు. దీనికి పరిష్కారంగా ప్రీప్రాసెసింగ్, ప్రాసెసింగ్, రిటైల్‌ రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. పౌష్టికాహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా మత్స్య ఉత్పత్తులకు స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎగుమతులకు అవకాశం ఉన్న మత్స్య ఉత్పత్తుల పెంపకంపై అవగాహన, శిక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు మేలు చేసేందుకు ఫీడ్, సీడ్‌లో నాణ్యత కోసం కొత్తగా చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. 


Also Read: బురద చల్లాలని చూస్తే పవన్ కల్యాణ్ కే ఇబ్బంది... పవన్ ను సినీ పెద్దలే గుదిబండలా భావిస్తున్నారు... బద్వేల్ లో వైసీపీ విజయం ఖాయమని సజ్జల కామెంట్స్


ఆక్వాహబ్ లు, ప్రాసెసింగ్ ప్లాంట్లతో రైతులకు మంచి ధరలు


ఆక్వా రైతులకు ఇచ్చే సబ్సిడీలు నేరుగా అందేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు మరింత మేలు చేయడానికి తగిన ఆలోచనలు చేయాలన్నారు. ఆక్వా హబ్‌ల్లో చిన్న సైజు రెస్టారెంట్‌ కూడా పెట్టే ఆలోచన చేయాలన్నారు. ఫిష్‌ ఆంధ్రా లోగోను సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. ఆక్వాహబ్‌లు, రిటైల్‌ దుకాణాల ద్వారా దాదాపు 40 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. జనవరి 26 నాటికి దాదాపు 75–80 హబ్‌లను, 14 వేల రిటైల్‌ అవుట్‌లెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 10 ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, 23 ప్రి ప్రాసెసింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనివల్ల రైతులకు మంచి ధరలు వస్తాయన్నారు.


Also Read: లీడర్స్..మరీ... కుక్కలు... పందులు స్థాయికి వెళ్ళకండి ప్లీజ్..! సభ్యత హద్దులు దాటిపోతున్న నేతల భాషా ప్రావీణ్యం !


వచ్చే ఏడాదికి 4 ఫిషింగ్ హార్బర్లు సిద్ధం


రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్‌ హార్బర్లలో పనులు ప్రారంభమయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలివిడతగా ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్‌–జులై నాటికి ఈ హార్బర్లను సిద్ధం చేస్తామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. మిగిలిన 5 ఫిషింగ్‌ హార్బర్ల పనులు ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించి 18 నెలల్లో పూర్తిచేయడానికి చర్యలు చేపడతామన్నారు.


Also Read: వైసీపీ ప్రభుత్వంపై మరోసారి పవన్ ఫైర్... ఉగ్రవాద పాలసీ అంటూ విమర్శలు... తుపాను బాధితులకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి