తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ) - 2020 మూడో విడత కౌన్సెలింగ్‌లో 42,468 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ లింబ్రాది వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 4వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, కాలేజీల్లో చేరాలని సూచించారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఇంట్రా కాలేజ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఒక కాలేజీలో సీట్లు పొందిన వారు.. బ్రాంచ్, కోర్సులను మార్చుకునేందుకు అక్టోబర్ 5 నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపారు. అక్టోబర్ 8వ తేదీన సీట్లు కేటాయిస్తామని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. దోస్త్ మూడు విడతల్లో ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులకు నేటి నుంచి (సెప్టెంబర్ 28) అక్టోబర్ 4 వరకు తమకు సీటు వచ్చిన కాలేజీలో భౌతికంగా రిపోర్టు చేయాలని సూచించారు.
Also Read: Navodaya Admissions: నవోదయలో 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
టీఎస్ దోస్త్ మూడో విడత ఫలితాలు చెక్ చేసుకోండిలా..
1. తెలంగాణ స్టేట్ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ అధికారిక వెబ్‌సైట్ dost.cgg.gov.inను ఓపెన్ చేయండి.
2. హోం పేజీలో ‘Candidate’s Login’ అనే ఆప్షన్ ఎంచుకోండి. దీంతో మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
3. ఇక్కడ అభ్యర్థులు తమ దోస్త్ ఐడీ, పిన్ నంబర్ వివరాలతో లాగిన్ అవ్వాలి.
4. లాగిన్ అయ్యాక TS DOST 3rd Phase Results 2021 అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయండి.
5. అక్కడ ఎలాట్‌మెంట్ లెటర్ కనిపిస్తుంది. దీనిని డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం వీటిని భద్రపరుచుకోండి.
దోస్త్ ద్వారా ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీఎస్సీ, బీకామ్, బీకామ్ ఆనర్స్, బీకామ్ ఒకేషనల్, బీబీఎం, బీఎస్ డబ్ల్యూ, బీసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ హాల్ టికెట్లు విడుదల..
జేఈఈ అడ్వాన్స్‌డ్- 2021 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జేఈఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారు.. jeeadv.ac.in ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను ఐఐటీ, ఖరగ్‌పూర్ నిర్వహిస్తోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అక్టోబర్ 3న జరగనుంది. అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని అక్టోబర్ 10న విడుదల చేస్తారు. పరీక్ష ఫలితాలను అక్టోబర్ 15న వెల్లడిస్తారు. ‘కీ’పై అభ్యంతరాలను అక్టోబర్ 10, 11 తేదీల్లో స్వీకరిస్తారు.
Also Read: UGC Scholarships: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..