తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల తేదీలను రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 2020- 21 విద్యా సంవత్సరానికి చెందిన ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. కోవిడ్ తీవ్రత కారణంగా గతేడాది ఇంటర్ పరీక్షలు నిర్వహించని కారణంగా వీరిని సెకండియర్‌కు ప్రమోట్ చేశారు. గతంలో ప్రకటించిన విధంగా.. 30 శాతం సిలబస్‌ను తప్పించి, 70 శాతం సిలబస్‌లోనే పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. కోవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. కోవిడ్ టీకాలు తీసుకున్న సిబ్బందినే విధుల్లోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఒకటి, రెండు ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వివరించింది. స్టాఫ్ నర్సు లేదా ఏఎన్ఎం అందుబాటులో ఉండనున్నట్లు చెప్పింది.
Also Read: Navodaya Admissions: నవోదయలో 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
పరీక్షలపై అభ్యంతరాలు..
కోవిడ్ తీవ్రత తగ్గిన తర్వాత ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా అందరినీ ప్రమోట్ చేయడం వల్ల నష్టపోయామని.. ఈ పరీక్షల ద్వారా మెరిట్ ఆధారంగా మార్కులు పొందగలమని కొందరు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఇక మరికొంత మంది మాత్రం ఇప్పటికే సెకండియర్ తరగతులు ప్రారంభం అయ్యాయని.. ప్రస్తుతం వివిధ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతున్నామని ఇలాంటి సమయంలో ఫస్టియర్ పరీక్షలంటే సమయం సరిపోదని అంటున్నారు.
Also Read: CBSE On Covid19: ఆ విద్యార్థులకు సీబీఎస్ఈ శుభవార్త.. కొవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో బోర్డు కీలక ప్రకటన
పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..
పరీక్ష తేదీ | సబ్జెక్టులు |
2021 అక్టోబర్ 25 | సెకండ్ లాంగ్వేజ్ |
అక్టోబర్ 26 | ఇంగ్లీష్ |
అక్టోబర్ 27 | మ్యాథ్స్-1ఏ, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 |
అక్టోబర్ 28 | మ్యాథ్స్-1బీ, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 |
అక్టోబర్ 29 | ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 |
అక్టోబర్ 30 | కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 |
నవంబర్ 1 | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 (బైపీసీ విద్యార్థుల కోసం) |
నవంబర్ 2 | మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 |
Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..