ఆర్థిక సమస్యల కారణంగా విద్యను కొనసాగించలేని మెరిట్ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, సంస్థలు, బ్యాంకులు స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ల పేరుతో సాయం అందిస్తున్నాయి. విద్యార్థులు చదువు కొనసాగించేలా తోడ్పాటు ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం ఆర్థిక సాయం అందించే 4 స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఆ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ల వివరాలు మీకోసం..
1. కోటక్ కన్యా స్కాలర్‌షిప్ (Kotak Kanya Scholarship 2021)
వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలకు ఉన్నత విద్యలో తోడ్పాటు అందించేందుకు కోటక్ మహీంద్ర గ్రూప్ ముందుకొచ్చింది. కోటక్ కన్యా స్కాలర్‌షిప్ పేరుతో సాయం అందిస్తోంది. దీన్ని కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ 75 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించరాదు.
- అందించే సాయం (రివార్డు): ఏడాదికి రూ.లక్ష వరకు అందిస్తారు.
- దరఖాస్తు స్వీకరణ ఆఖరు తేదీ: 2021 సెప్టెంబర్ 30
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక నోటిఫికేషన్ వివరాలు: https://kotakeducation.org/kotak-kanya-scholarship/
2. ఐఐటీ కాన్పూర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 2021
ఐఐటీ కాన్పూర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 2021 అనేది పీహెచ్‌డీ (PhD) / ఎంఎస్సీ (MSc) డిగ్రీ హోల్డర్లకు అందించే ఫెలోషిప్. మాథమెటిక్స్‌లో పీహెచ్‌డీ లేదా ఎంఎస్సీ చేసిన అభ్యర్థులు ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వీరు రీసెర్చ్ చేసేందుకు నెలకు కొంత మొత్తం ఆర్థిక సాయం అందిస్తారు. 'Some Compact Commutator Problems in Operator Theory' అనే ప్రాజెక్టు పేరుతో ఈ ఫెలోషిప్ ఇస్తున్నారు.
- అందించే సాయం (రివార్డు): నెలకు రూ.31,000
- దరఖాస్తు స్వీకరణ ఆఖరు తేదీ: 2021 సెప్టెంబర్ 30
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక నోటిఫికేషన్ వివరాలు: https://www.iitk.ac.in/dord/project/math-jrf-31-08-21.html
3. ఐఐఏ చంద్రశేఖర్ పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్‌లు 2021
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) పీహెచ్‌డీ పూర్తి చేసిన వారి కోసం ఐఐఎ చంద్రశేఖర్ పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్ 2021 ద్వారా సాయం అందిస్తుంది. ఆస్ట్రోనమీ (astronomy), ఆస్ట్రో ఫిజిక్స్ (astrophysics) విభాగాల్లో బెస్ట్ అకడమిక్ క్రెడెన్షియల్స్ ఉన్న మెరిట్ విద్యార్థుల కోసం దీనిని రూపొందించారు. పీహెచ్‌డీ డిగ్రీని కలిగి ఉన్న వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు వయసు 32 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి.
- అందించే సాయం (రివార్డు): ఫెలోషిప్ కింద నెలకు రూ.80,000 నుంచి రూ.2,00,000 వరకు అందిస్తారు.
- దరఖాస్తు స్వీకరణ ఆఖరు తేదీ: 2021 సెప్టెంబర్ 30
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక నోటిఫికేషన్ వివరాలు: https://www.iiap.res.in/post_doc/
4. షెఫ్లర్ ఇండియా హోప్ ఇంజనీరింగ్ స్కాలర్‌షిప్
తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ షెఫ్లర్ ఇండియా హోప్ ద్వారా స్కాలర్‌షిప్ ఆర్థిక సాయం అందిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకునేందుకు ఇది తోడ్పడుతుంది. అలాగే తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 12వ తరగతిలో (సైన్స్) 60% కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ఈ ప్రోగ్రాంకు ఎంపికైన వారికి ఇంజనీరింగ్ ఫస్టియర్ నుంచి సాయం అందిస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించరాదు.
- అందించే సాయం (రివార్డు): ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు ఏడాదికి రూ.75000 చొప్పున సాయం అందిస్తారు.
- దరఖాస్తు స్వీకరణ ఆఖరు తేదీ: 2021 సెప్టెంబర్ 30
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక నోటిఫికేషన్ వివరాలు: www.b4s.in/it/SIHE3
Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..
Also Read: IIT Admissions: ఆర్ట్స్, కామర్స్ వాళ్లు కూడా ఐఐటీల్లో చేరవచ్చు.. ఎలా అంటే?