సాహోతో తెలుగు ప్రజలకు చేరువైన అందాల రాశి శ్రద్ధా కపూర్.  బాలీవుడ్ లో వరుస సినిమాలో బిజీగా ఉన్న ఈ భామకు హఠాత్తుగా ముంబై నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనిపించింది. తన స్వాంకీ కార్లో వెళితే రొటీన్ గానే ఉంటుంది, అందుకే సాధారణ అమ్మాయిలా ఆటోలో వెళ్లింది. బ్యూటీఫుల్ సిటీని వీడియోలో బంధించింది. ఆ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను జతచేర్చి తన ఇన్ స్టాలో పోస్టు చేసింది. క్యాప్షన్ ఏమీ పెట్టకుండా కేవలం ఆటో బొమ్మ, ఊదారంగు లవ్ సింబల్ మాత్రమే పెట్టింది. ఆ వీడియో చూసిన వాళ్లకి ఆటోలో తిరిగింది శ్రద్ధానేనని సులువుగా అర్థమైపోతుంది. షార్ట్ క్లిప్పే పెట్టినప్పటికీ నెటిజన్లకు అది బాగా నచ్చేసింది. ఒక అభిమాని ‘మీ సింప్లిసిటీ నచ్చింది మేడమ్’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘ఆ ఆటోలో నేను కూడా ఉండే బావుండేది’ అని కామెంట్లు చేస్తున్నారు. గతంలో శ్రద్ధా ఎప్పుడూ ఆటో ఎక్కిన సంఘటనలు లేవు. ఇదే మొదటిసారి. 


గతంలో చాలా బాలీవుడ్ సెలెబ్రిటీలు అభిమానుల కళ్లగప్పి ఆటోల్లో షికార్లు కొట్టారు. మొన్నటికి మొన్న అలియభట్ తన షూటింగ్ లొకేషన్ కు ఆటోలోనే వెళ్లి వార్తల్లో నిలిచింది. సల్మాన్ ఖాన్, దిశా పటాని, సంజయ్ దత్ వంటి స్టార్లు కూడా ఇలా ఆటో ప్రయాణాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు శ్రద్ధా వంతు వచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే శ్రద్ధా ప్రస్తుతం ‘చల్ బాజ్ ఇన్ లండన్’ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీ సూపర్ హిట్ సీరియల్ నాగిన్ కథ ఆధారంగా ఓ తెరకెక్కబోతోంది. దానికి కూడా శ్రద్ధా సైన్ చేసింది. 


శ్రద్ధా సినిమా కుటుంబ నేపథ్యం నుంచే వచ్చింది. తండ్రి శక్తి కపూర్ బాలీవుడ్లో ప్రముఖ నటుడు. 2013లో ఆమె చేసిన ఆషికి2 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. శ్రద్ధా నటించిన చాలా సినిమాలు కమర్షియల్ మంచి విజయం అందుకున్నాయి. ఈమె మంచి నటే కాదు, గాయకురాలు కూడా. తన సినిమాల్లో పాటలు కూడా పాడింది. తెలుగులో సాహో సినిమాతో తెరంగేట్రం చేసింది. 






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 


Also read: ‘రైమ్’ ను ముద్దులతో ముంచెత్తుతున్న రామ్ చరణ్.. క్యూట్ పప్పీతో షికార్లు


Also read: సాయిపల్లవిలాంటి డ్యాన్సర్ ను ఎప్పుడూ చూడలేదు... ట్వీట్ లో మహేష్ ప్రశంసలు, చైతూ రెస్పాన్స్


Also read: నాన్నగారు లేరంటే నమ్మలేకపోతున్నా.. త్వరలోనే స్మారక మందిరం పూర్తి చేస్తా -ఎస్పీ చరణ్