మొన్నటి వరకు సినిమాలు లేక వెలవెల లాడిన థియేటర్లు అక్టోబర్ లో కళకళ లాడిపోనున్నాయి. దాదాపు నాలుగైదు సినిమాలు అక్టోబర్ లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా అఖిల్ కొత్త మూవీ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్’ కూడా దసరా రోజున విడుదల చేయనున్నట్టు గీతా ఆర్ట్స్ సంస్థ ట్విట్టర్ లో ప్రకటించింది. మిమ్మల్ని ఈ దసరా పండుగకు మా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ సినిమా చూసేందుకు థియేటర్లకు ఆహ్వానిస్తున్నామంటూ ట్వీట్ చేసింది. 


అఖిల్ హీరోగా, పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ముందుగా ప్రకటించారు. ఇప్పుడు అక్టోబర్ 15 కు వాయిదా వేశారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి ఆదరణే లభిస్తోంది. అక్టోబర్ 15 దసరా పండుగ. అందుకే ఆ రోజునే సినిమాలు విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు మొగ్గుచూపుతున్నారు. 


ఎన్ని సినిమాలో...


నాగశౌర్య హీరోగా చేసిన సినిమా ‘వరుడు కావలెను’. ఆ సినిమాను కూడా దసరాకు విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక సిద్ధార్ట్, శర్వానంద్ కలిసి నటిస్తున్న ‘మహాసముద్రం’ సినిమా అక్టోబర్ 14న విడుదల కానుంది. అలాగే అక్టోబర్ 1న సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ విడుదల కానుంది. వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా నటించిన ‘కొండ పొలం’ అక్టోబర్ 8 న వస్తుందని అంటోంది చిత్ర యూనిట్. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చేస్తున్న ఈ సినిమా కూడా అక్టోబర్ లోనే విడుదల చేయనున్నారు. దీన్ని బట్టి చూస్తే అక్టోబర్ లో చిన్న సినిమాలు భారీగా రాబోతున్నాయి. ప్రేక్షకులకు పండగే పండగ. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Also read: నాన్నగారు లేరంటే నమ్మలేకపోతున్నా.. త్వరలోనే స్మారక మందిరం పూర్తి చేస్తా -ఎస్పీ చరణ్


Also read: సాయిపల్లవిలాంటి డ్యాన్సర్ ను ఎప్పుడూ చూడలేదు... ట్వీట్ లో మహేష్ ప్రశంసలు, చైతూ రెస్పాన్స్


Also read: మీకోసం బెస్ట్ ఫుడ్ ప్లాన్.. సూచిస్తున్నది ఓ బాలీవుడ్ సెలెబ్రిటీ న్యూట్రిషనిస్టు