సాధారణ ప్రజలు ఆహారంపై పెద్దగా శ్రద్ధ చూపించరు. పొట్ట నిండేందుకు ఏదో ఒకటి తినాలనుకుంటారు. దాని వల్లే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. గతేడాది కరోనా లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఇళ్లకే పరిమితిమయ్యారు. అంతెందుకు అప్పటి నుంచి ఇప్పటి  వరకు వర్క్ ఫ్రం హోం చేస్తున్నవాళ్లు ఎంతో మంది. వారిలో చాలా మంది ఇంటి పట్టునే ఉండడం వల్ల బరువు పెరిగామని బాధపడుతున్నారు. కానీ సెలెబ్రిటీలు కూడా చాలా నెలలు షూటింగ్ లేకుండా ఇంటి పట్టునే ఉంటున్నప్పటికీ బరువు పెరిగారన్న గాసిప్పులు రాలేదు. కారణం వారు తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాలే. వారికి ప్రత్యేకంగా న్యూట్రిషనిస్టుటు కొవ్వులేని, శక్తినిచ్చే ఆహార మెనూని సిద్ధం చేస్తారు. అందుకే వారి బరువు కంట్రోల్ లో ఉంటుంది. సెలెబ్రిటీ ఆహార మెనూ సామాన్యులకు కూడా అందుబాటులో ఉంచాలనే మా ప్రయత్నం. వారు తినేవి కూడా మనకు అందుబాటులో ఉండేవే. ప్రముఖ డైటిషియన్ శ్వేతా షాకు... కత్రినా కైఫ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, సాక్షి సింగ్ ధోనీ వంటి సెలెబ్రిటీలు క్లయింట్లు ఉన్నారు. ఆమె చెప్పిన ప్రకారం రోజువారీ డైట్ ఎలా ఉండాలో తెలియజేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఫుడ్ ప్లాన్ ను అందించారు. మీరు కూడా ఇది ఫాలో అయితే ఆరోగ్యం, అందం ... రెండూ సొంతమవుతాయి. 


పరగడుపున
రాత్రి పడుకోబోయే ముందు గ్లాసుడు నీళ్లలో సోంపు గింజలు లేదా నల్ల ఎండు ద్రాక్ష వేసి నానబెట్టాలి. ఉదయం లేచాక వాటిని తాగాలి. లేదా జీలకర్ర, అల్లం కలిపిన నీళ్లను తాగినా మంచిదే. ఈ పానీయాలు పొట్టని శుభ్రం చేస్తాయి. గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. 


బ్రేక్ ఫాస్ట్
టిఫిన్ గా ఓట్స్ తో చేసిన వంటకాలు మంచివి. బ్రెడ్ టోస్ట్, ఆమ్లెట్, రాగి ఊతప్పం, మొలకలు, పండ్లతో చేసిన స్మూతీలు తింటే చాలా మంచివి. ఇవి బరువును కంట్రోల్ లో ఉంచడంతో పాటూ శరీర మెరుపును పెంచుతాయి. మొటిమల సమస్య ఉన్నవారు, పొడి చర్మంతో బాధపడేవారు బ్రేక్ ఫాస్ట్ లో కాలే,బ్రకోలీ, బీట్ రూట్, క్యారెట్ జ్యూసులు తాగితే మంచిది. 


లంచ్
సోనామసూరి, బ్రౌన్ రైస్, కోలం రైస్ లతో వండిన అన్నాన్ని తినమని సిఫారసు చేస్తున్నారు శ్వేత.  కూరగాయలతో నిండిన కూరలు, పప్పుతో లంచ్ తీసుకోవచ్చు. చివరలో మజ్జిగ తాగడం కచ్చితంగా అలవాటుగా మార్చుకోవాలి. జీర్ణక్రియకు ఇది సహకరిస్తుంది. 


డిన్నర్
రాత్రి వేళ ఏదో ఒక సూప్ తో భోజనం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు. ములక్కాడ-సెలెరీ సూప్ మంచి క్లెన్సర్ లా పనిచేస్తుంది. మొటిమలు వస్తున్నట్టయితే గుమ్మడి-క్యారెట్ సూప్, బూడిద గుమ్మడి కాయ సూప్ ను ప్రయత్నించవచ్చు. ఇక భోజనంలో ప్రొటీన్ ఉన్న ఆహారాన్ని తినాలి. కూరగాయలు వేసి చేసే కిచిడీలు లేదా బంగాళాదుంపలు, కాలీఫ్లవర్ కూరలు వంటివి ప్రయత్నించవచ్చు. కొంచెం మొత్తంలో చికెన్, చేపలు కూడా తింటే చాలా మంచిది.   


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 


Also read: లగ్జరీ ద్రాక్ష.. ఒక్క పండు తినాలంటే రూ.35,000 ఖర్చుపెట్టాలి


Also read: జపాన్ వారి సోబా నూడిల్స్ ట్రై చేశారా... ఎంత రుచో, అంత ఆరోగ్యం కూడా


Also read: సగ్గు బియ్యంతో బరువు తగ్గే ఛాన్స్.. అదొక్కటే కాదు మరెన్నో ప్రయోజనాలు