నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష, ఎరుపు ద్రాక్ష... ఇలాంటి ద్రాక్ష రకాలు తెలుసు. కానీ వీటిల్లో కూడా అత్యంత ఖరీదైన ద్రాక్ష రకం ఉంది. అది మనదేశంలో పండదు. కేవలం జపాన్ లో మాత్రమే పండుతుంది. పేరు రూబీ రోమన్. ప్రస్తుతం ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన ద్రాక్ష. 2020 సంవత్సరంలో ఈ రూబీరోమన్ ద్రాక్ష గుత్తిని వేలం వేశారు. ఆ గుత్తిలో కేవలం 30 పండ్లు మాత్రమే ఉన్నాయి. అది 12,000 డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే కేవలం ఒక్క పండు 400 డాలర్లకు అమ్ముడుపోయింది. అదే మనరూపాయల్లో చెప్పుకోవాలంటే ఒక పండు రూ.35,000. అదే గుత్తి మొత్తం సొంతంచేసుకోవాలంటే మన కరెన్సీలో  తొమ్మిది లక్షల రూపాయల దాకా చెల్లించుకోవాలి. 


ఎందుకంత గొప్ప?
రూబీ రోమన్ అన్ని చోట్ల పండదు. జపాన్లోని ఇషికావా అనే ప్రాంతంలో మాత్రమే రూబీ రోమన్ ఎదగగలిగే వాతావరణం ఉంటుంది. ప్రకృతిలో చాలా అరుదైన పండ్లలో ఇవీ ఒకటి. ఏడాదికి కేవలం 24,000 ద్రాక్ష గుత్తులు మాత్రమే కాస్తాయి. వీటి పంట చేతికొచ్చేందుకు దాదాపు పద్నాలుగేళ్లు పడుతుంది. సాధారణ ద్రాక్షతో పోలిస్తే ఇవి పరిమాణంలో పెద్దవి. వీటిని ప్యాక్ చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్యాక్ చేసే ముందు వాటి నాణ్యత, రంగు పూర్తిగా పరీక్షిస్తారు. ప్రతి పండు కనీసం 20 గ్రాముల బరువు, 18 శాతం కంటే ఎక్కువ చక్కెరను కలిగి ఉంటేనే దాన్ని మార్కెట్లోకి పంపిస్తారు. ఇక వీటిల్లో కూడా ప్రీమియం రకానికి చెందిన పండ్లు కనీసం 30 గ్రాముల బరువు ఉండాలన్న నియమం ఉంది.  చాలా పరీక్షలు పాసయ్యాకే ఆ పండ్లను మార్కెట్లోకి పంపిస్తారు. 


పుట్టి పదమూడేళ్లు...
రూబీ రోమన్ ద్రాక్షను తొలిసారి పండించింది 2008లో. ఈ కొత్తరకం ద్రాక్షకు ఏ పేరుపెట్టాలని ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశారు. చివరికి రూబీ రోమన్ అనే పేరును ఎంచారు. ఇప్పుడివి ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆహార పదార్థాల జాబితాలో చేరాయి. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.


Also read: గుడ్డులోని పచ్చసొన తింటే బరువు పెరుగుతారని తినకుండా పడేస్తున్నారా? ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారు?


Also read: ఆకుకూరల గురించి అపోహలు వీడమంటున్న ఆయుర్వేదం


Also read:  పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?


Also read: నెలసరి నొప్పి భరించలేకపోతున్నారా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?