నెలసరి సమయంలో అందరి మహిళలకు ఒకేలా ఉండాలని లేదు. కొందరికి అధిక రక్తస్రావం కలుగవచ్చు, కొందరికి కలగకపోవచ్చు. అలాగే పొట్టనొప్పి కూడా. కొంతమందికి విపరీతంగా పొత్తికడుపు నొప్పి వస్తుంది. ఆ నొప్పి రెండు నుంచి మూడు రోజుల పాటూ ఉంటుంది. దాన్ని భరించలేక కొందరు అమ్మాయిలు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడుతుంటారు. వీటిని ప్రతినెలా వాడడం మంచిది కాదు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ అల్కా విజయన్. ఈమె తన ఇన్ స్టా ఖాతాలో ఏడు చిట్కాలను చెప్పారు. వీటిని ఫాలో అయితే పీరియడ్స్ పెయిన్ నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు.
1. సోంపు గింజలతో తయారుచేసిన టీని రోజూ తాగితే మంచిది.
2. రోజూ నువ్వుల నూనెతో పొట్ట చుట్టూ మసాజ్ చేసుకుని అభ్యంగ స్నానం చేయాలి.
3. వంటల్లో జీలకర్ర, సోంపుల వాడకాన్ని పెంచాలి.
4. పీరియడ్స్ సమయంలో వర్కవుట్స్ కు దూరంగా ఉండాలి.
5. పీరియడ్స్ సమయంలో కాకుండా మిగతా రోజులు మాత్రం వ్యాయామాలు చేయాలి.
6. వంటల్లో నువ్వుల నూనె వాడడం ప్రారంభించాలి.
7. పంచదారతో చేసిన తీపి పదార్థాలు తినడం తగ్గించాలి.
నొప్పి ఎందుకు వస్తుంది?
పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని ‘డిస్మెనోరియా’ అంటారు. గర్భాశయంలో కలిగే సంకోచ వ్యాకోచాలే దీనికి కారణం. గర్భాశయ కండరాలు సంకోచించినప్పుడు రక్తసరఫరా తగ్గుతుంది. దీంతో కండరాలకు ఆక్సిజన్ సరిగా అందదు. అప్పుడు పొట్ట నొప్పిగా అనిపిస్తుంది. అలాగే గర్భాశయ ద్వారా చిన్నదిగా ఉన్నా కూడా నొప్పి ఎక్కువగానే ఉంటుంది. ఈ నొప్పి అధికంగా 14 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఆడవారిలో కనిపిస్తుంది.
Also read: గుడ్డులోని పచ్చసొన తింటే బరువు పెరుగుతారని తినకుండా పడేస్తున్నారా? ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారు?
Aslo read: ఇరవై మూడేళ్లకే ఆరు సార్లు క్యాన్సర్ ను జయించిన విజేత... ఇప్పుడు అతడో స్పూర్తిప్రదాత
Also read: గుండె జబ్బుకు గురికాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే... తేల్చిన హార్వర్డ్ అధ్యయనం