గుడ్డును సంపూర్ణ పోషకాహారం అంటారు. మరి మనలో చాలా మంది గుడ్డును సంపూర్ణంగా తినకుండా తెల్లసొన తిని, పచ్చసొన పడేస్తారు. అలాంటప్పుడు గుడ్డు అందించే సంపూర్ణ పోషకాలు మనకెలా అందుతాయి? శరీరానికి ఉపయోగపడే మినరల్స్ 45 అయితే, అందులో గుడ్డులో 44 మినరల్స్ ఉన్నాయి. అందులోనూ పచ్చసొనలో 12 దాకా మినరల్స్ ఉన్నాయి. కనుక సంపూర్ణ ఆరోగ్యం కోసం పచ్చసొన కూడా తినాల్సిందే. సెలెబ్రిటీ డైటీషియన్ రుచిరా బాత్రా చెప్పిన దాని ప్రకారం... పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ అది రక్తంలో కలిసే చెడు కొలెస్టాల్ కాదు. పచ్చసొనలో అధిక కొవ్వు ఉన్నప్పటికీ అది రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచదని అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. కాబట్టి పచ్చసొనను కూడా తింటే చాలా మంచిది. అయితే ఊబకాయంతో బాధపడే వారు మాత్రం అప్పుడప్పుడు మాత్రమే పచ్చసొనను తీసుకుంటే మంచిది.
పచ్చసొనలో విటమిన్ ఎ, బి, ఇ, డి, కె లతో పాటూ సెలీనియం, జింక్ వంటి ముఖ్య పోషకాలు కూడా ఉంటాయి. విటమిన్ డి కూడా దీన్నుంచి లభిస్తుంది. ల్యూటిన్ అనే యాంటీఆక్సిడెంట్ దీనిలో ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోజుకో గుడ్డు తినడం అలవాటుగా మార్చుకుంటే గుండె సంబంధింత వ్యాధులకు గురికాకుండా జాగ్రత్త పడచ్చు. గుడ్డలోని ఇనుమును శరీరం సులువుగా గ్రహిస్తుంది. గర్భవతులకు గుడ్డు పెడితే అందులోని ఫోలిక్ యాసిడ్ పుట్టబోయే బిడ్డకు మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించడంలో గుడ్డులోని బయోటిన్ సహకరిస్తుంది.
బరువు పెరుగుతారా?
బరువు పెరగడం అనేది శరీరంలోకి చేరే కెలోరీల మీద ఆధారపడి ఉంటుంది. పచ్చసొనలో కెలోరీలు తక్కువగానే ఉంటాయి. కనక దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతామనే భయం పెట్టుకోవద్దని అంటున్నారు రుచిరా భాత్రా. ఎక్కువ ఆహారం తింటే ఎక్కువ కెలోరీలు ఒంట్లోకి చేరతాయి... అలాగే ఎక్కువ గుడ్లు తింటే... అధికంగా కెలోరీలు శరీరానికి అందుతాయి అంటున్నారు ఆమె. కనుక రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు మాత్రమే తింటే ఆరోగ్యంగా ఉండొచ్చని, బరువు పెరుగుతామన్న భయం పెట్టుకోవద్దని చెబుతున్నారు. కనుక పచ్చసొన తీసి బయటపడేయకుండా తిని ఆరోగ్యంగా ఉండండి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: ఇరవై మూడేళ్లకే ఆరు సార్లు క్యాన్సర్ ను జయించిన విజేత... ఇప్పుడు అతడో స్పూర్తిప్రదాత
Also read: ఆన్ లైన్ లో స్పెర్మ్ ఆర్డర్... తొమ్మిది నెలల తరువాత పండంటి బిడ్డ
Also read: గుండె జబ్బుకు గురికాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే... తేల్చిన హార్వర్డ్ అధ్యయనం