గర్భవతులు వారి ఆహారం, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఈ సమయంలో యోగా చేయడం వల్ల ఓవరాల్ హెల్త్ బాగుంటుందని నిపుణులు అంటున్నారు. యోగా వల్ల బలం వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. గర్భిణులు రోజూ 90 నిమిషాలపాటు యోగా చేయడం వల్ల కడుపులోని పిండం మరింత ఆరోగ్యంగా పెరుగుతున్నట్లు తెలిసింది. యోగా చేసే తల్లులు ఈ మార్పులను సులభంగా గుర్తిస్తున్నట్లుగా కూడా తేలింది. అయితే గర్భవతులు అనుసరించాల్సిన యోగా ప్రక్రియలను కేవలం నిపుణులైన యోగా టీచర్ల సమక్షంలోనే ఆచరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ యోగాసనాలు వేయడం వల్ల గర్భీణీలకు మంచి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. 


Also Read: Sompu Tea: సోంపుతో ఎప్పుడైనా టీ చేయడం ట్రై చేశారా? సోంపు టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది


​చంద్ర నమస్కారాలు


చంద్ర నమస్కారాలలో తొమ్మిది ఆసనాలు ఉంటాయి. చంద్రుడు భావోద్వేగాలకీ, రుచికీ అధిపతి. చంద్ర నాడి ఎడమవైపున ఉంటుంది. కాబట్టి మీరు ఈ యోగాసనాలని ఎడమ కాలితో మొదలు పెట్టాలి. ఈ నమస్కారాలని సాయంత్రం ఆరు గంటలకి చంద్రుణ్ణి చూస్తూ ప్రాక్టీస్ చేస్తే మంచిది. రోజులో ఎప్పుడైనా చంద్ర నమస్కారాలు చేయవచ్చు.


​* మూర్చ ప్రాణాయామం



1. మీకు సౌకర్యంగా ఉన్న పొజిషన్‌లో కూర్చోండి. సుఖాసనం, పద్మాసనం, అర్ధ పద్మాసనంలో ఏదైనా పోజ్ లో కూర్చోండి.


2. మీ బ్యాక్ స్ట్రైట్ గా ఉంచి కళ్ళు మూసుకోండి.


3. మీ మోకాళ్ళ మీద అరిచేతులు పైకి చూసేలా ఉంచండి.


4. తల వంచండి, గడ్డం మీ చాతీ వైపు ఉండాలి.


5. ముక్కుతో గాలి పీల్చుకోండి, లంగ్స్ నిండుగా గాలి పీల్చుకోండి.


6. తలెత్తి మీ తలని మీ భుజాల మీద రెస్ట్ తీసుకోనివ్వండి.


7. గాలి వదలకుండా నోటిని ఓపెన్ చేయండి.


8. ఎంత సేపు అలా ఊపిరి వదలకుండా ఉంచగలరో అంత సేపు ఉంచండి.


9. ఆ తరువాత, నోరు మూసేసి, తల ముందుకి వంచి గడ్డం చాతీ వైపు ఉంచి అప్పుడు ఊపిరి వదలండి.



​ఈ యోగాసనాల వల్ల బెనిఫిట్స్



1. డీఎన్ఏ స్ట్రక్చర్‌ని అల్టర్ చేయడం ద్వారా జెనిటిక్ డిసీజెస్ ని ప్రివెంట్ చేస్తాయి.


2. మానసిక బలాన్ని పెంచుతాయి.


3. మైండ్ ని క్లెన్స్ చేసి యోగాసనాలు వేసేవారిని ఆనందంలో ముంచెత్తుతాయి.


* శ్వాస్ ధ్యాన్, స్థితి ధ్యాన్, సాక్షి ధ్యాన్ వంటి మెడిటేషన్ టెక్నిక్స్ కూడా ప్రెగ్నెన్సీ సమయంలో హెల్ప్ చేస్తాయి. మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం రోజుకి 20 - 30 నిమిషాలు ప్రాణాయామం, యోగాసనాలు, మెడిటేషన్ కి కేటాయించండి. ఇలా చేయడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు సానుకూల భావాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి