భోజనం తిన్న తర్వాత మౌత్ ఫ్రెషనర్‌గా సోంపు నములుతారు. అంతేకాదు, ఈ గింజలను రకరకాల వంటలలో కూడా ఉపయోగిస్తారు. సోంపు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల రక్త పోటును నియంత్రించవచ్చు. కంటి చూపు మెరుగుపడుతుంది. బరువు తగ్గిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలకు చక్కగా పని చేస్తుంది. సోంపుతో ఎప్పుడైనా టీ చేయడం ట్రై చేశారా? సోంపు టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. 


Also Read: Knee Pain: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు ట్రై చేయండి


జీర్ణక్రియ అనేది సరిగా లేకపోతే ఆ ప్రభావం రోజు వారీ పని పై తీవ్ర ప్రభావం చూపుతోంది. జీర్ణ సమస్యలను అధిగమించడానికి ఫెన్నెల్ టీ సహాయపడుతుంది. ఫెన్నెల్ టీ అనేక జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి మీకు సహాయపడుతుంది. ఫెన్నెల్ టీ తాగడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. 


Also Read: TOMATO FACE PACKS: టమాటా ప్యాక్ ఎప్పుడైనా ట్రై చేశారా? జిడ్డు చర్మం, మొటిమలకు ఇది సరైన ఔషధం


సోంపు గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. రోజూ నిద్రలేవగానే సోంపు టీ తాగితే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దీంతోపాటు శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. 


Also Read: Sun Screen: సన్‌స్క్రీన్ లోషన్ ఎందుకు వాడాలి? ప్రయోజనాలేంటి?


సోంపు గింజలు క్యాన్సర్ సమస్యను నివారించడంలో కూడా సహాయపడతాయి. కడుపు, చర్మం లేదా రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ల నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఫెన్నెల్ సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది. ఫెన్నెల్ టీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వేడి ఫెన్నెల్ టీ తాగడం వల్ల రుతు సమస్యలు తగ్గుతాయి. ఈ టీ శ్వాస కోశ సమస్య, ఉబ్బసం లక్షణాలను తగ్గించడానికి ఫెన్నెల్ సహాయపడుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. 


సోంపు కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల సోంపును రెండు కప్పుల నీటిలో వేయండి. దీనికి కొన్ని పుదీనా ఆకులు జోడించండి. ఈ నీటిని రెండు మూడు నిమిషాలు మరిగించండి. రుచి కోసం తేనెను జోడించవచ్చు. ఇలా రోజూ తాగడం వల్ల అనేక సమస్యలకు దూరం కావొచ్చు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి